newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

కోవిడ్ పై కదం తొక్కిన సాయుధ దళం.. మోడీ కితాబు

07-05-202107-05-2021 06:56:29 IST
Updated On 07-05-2021 07:27:50 ISTUpdated On 07-05-20212021-05-07T01:26:29.268Z07-05-2021 2021-05-07T01:26:26.592Z - 2021-05-07T01:57:50.285Z - 07-05-2021

కోవిడ్ పై కదం తొక్కిన సాయుధ దళం.. మోడీ కితాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ సరిహద్దులను కాపాడటంలోనే కాదు కోవిడ్ మహమ్మారి వంటి ప్రాణాంతక వైరస్ లను ఎదుర్కోవడంలో కూడా సాయుధ దళాలు నిరుపమాన రీతిలో తమ శక్తి యుక్తులను అందించాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ వైరస్ ను ఎదుర్కునే విషయంలో అన్నివిధాలుగా ఈ దళాలు ప్రభుత్వానికి తోడ్పడ్డాయని, త్రివిధ దళాలు త్రిముఖ వ్యూహంతో వైరస్ వ్యతిరేక పోరాటానికి కొత్త శక్తిని ఇచ్చాయని అన్నారు. ఈ కనిపించని శత్రువును కడతేర్చడంలో, అలాగే వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సాయుధ దళాలు ఎనలేని రీతిలో తోడ్పడుతున్నాయని మోడీ పేర్కొన్నారు.   

ఒక పక్క శాస్త్రవేత్తలు, మరో పక్క ఆరోగ్య నిపుణులు, అధికారులు సాగిస్తున్న వైరస్ వ్యతిరేక పోరాటానికి ఈ సాయుధ దళాల తోడ్పాటు మరింత ఊతాన్ని ఇచ్చింది. ప్రజల ఇబ్బందులను తీర్చడంలో సాయుధ వైద్య సర్వీసులు, డి ఆర్ డి ఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, రక్షణకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు, ఎన్ సి సి, కంటోన్మెంటు బోర్డులు ఇలా ప్రతి రంగాన్ని సంబంధించిన సాధన సంపత్తిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్రోడీకరించుకొని పోరాట పటిమను పెంచింది.

ముఖ్యంగా ఈ కోవిడ్ వ్యతిరేక చర్యల్లో రక్షణ మంత్రిత్వ శాఖ నిరుపమాన రీతిలోనే ప్రజలకు అన్ని విధాలుగా తోడ్పడిందని చెప్పడానికి ఆక్సిజన్ ను విదేశాల నుంచి స్వదేశానికి తీసుకు రావడం, దేశీయంగా వీటిని అవసరమైన ప్రాంతాలకు తరలించడం వంటి సేవలను యుద్ధప్రాతిపదికన చేపట్టడమే నిదర్శనం. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పౌర పాలనా వ్యవస్థకు అన్ని విధాలా సహకరించాలని రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సాయుధ దళాలను ఆదేశించిన నేపథ్యంలో ఈ రక్షణ దళాలు దేశ ప్రజల ప్రాణ రక్షణ బాధ్యతను చేపట్టాయి.   

దేశీయంగానూ, విదేశీయంగానూ ఎలాంటి విపత్తు సంభవించినా తామున్నామంటూ ముందుకు వచ్చేది ఈ సాయుధ దళాలే. నిధులపరంగా ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం సాయుధ దళాలకు అత్యవసర ఆర్ధిక అధికారాలను అందించింది. ఇటు నిధులకు కొదువ లేకపోవడం, అటు సిబ్బంది పరంగానూ లోటు లేకపోవడంతో ఈ సాయుధ బలగాలు జై హో భారత్ అంటూ వైరస్ వ్యతిరేక పోరాటానికి కదం తొక్కాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన మానవ వనరులు, సాధన సంపత్తి సాయుధ దళాలకు ఉండటం వల్ల దాదాపు అన్ని చోట్లా కూడా ఈ త్రివిధ దళాలు ప్రజలకు ఆపన్న హస్తాన్ని అందించాయి. అన్ని విధాలుగా వారిని ఆదుకుంటూ మహమ్మారిపై సాగుతున్న పోరాటానికి మరింత పదును కల్పించాయి. 

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   2 hours ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   9 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle