ఆల్ టైమ్ రికార్డును అందుకున్న పెట్రోలు ధర
07-01-202107-01-2021 16:36:56 IST
Updated On 07-01-2021 17:06:45 ISTUpdated On 07-01-20212021-01-07T11:06:56.934Z07-01-2021 2021-01-07T11:06:50.099Z - 2021-01-07T11:36:45.679Z - 07-01-2021

గత కొద్దిరోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధర నిన్న ఈరోజు పెరుగుతూ వచ్చాయి. 29 రోజుల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ విధానంలో ఇంధన ధరల సవరణ చేస్తున్న చమురు కంపెనీలు సుదీర్ఘ విరామం తర్వాత తాజా ధరలను ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ పై 26 పైసలు, లీటర్ డీజిల్ పై 25 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.97కి చేరింది. డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రూ.73.87 నుంచి రూ.74.12కి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.19కి చేరగా, డీజిల్ ధర రూ.83.25కి పెరిగింది. హైదరాబాదులో పెట్రోల్ లీటర్ ధర రూ.87.34 కాగా, డీజిల్ ధర రూ.80.88కి చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.89.71కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.82.81కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.45 శాతం పెరుగుదలతో 53.84 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.08 శాతం పెరుగుదలతో 49.97 డాలర్లకు ఎగసింది. ఈరోజు దేశంలో పెట్రోలు ధర "ఆల్ టైమ్ రికార్డు"కు చేరుకుంది. అక్టోబర్ 2018లో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 84ను తాకగా, ఇప్పుడా ధర రూ. 84.20కి చేరి సరికొత్త రికార్డును చేరుకుంది. దాదాపు 29 రోజుల తరువాత బుధవారం మరోసారి ధరలు పెరుగగా, గురువారం నాడు లీటరు పెట్రోల్ పై 23 పైసలు, డీజిల్ పై 26 పైసల మేరకు ధర పెంచుతున్నట్టు ముడి చమురు కంపెనీలు వెల్లడించాయి. తాజా పెరుగుదలతో ముంబైలో పెట్రోలు ధర రూ.90.83కు, డీజిల్ ధర రూ.81.07కు చేరగా, చెన్నైలో పెట్రోలు రూ.86.96కు, డీజిల్ రూ. 79.72కు చేరాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముడి చమురు కంపెనీలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతూ ఉండడంతో మధ్య తరగతి ప్రజలపై భారం పడనుంది. ఇక పెట్రోల్-డీజిల్ ధరలు 100 రూపాయలు తగలడమే తరువాయి అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇది చదవండి: పెట్రోల్ బాదుడు మళ్లీ షురూ..ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కా..!

వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం
3 hours ago

సరిహద్దుల్లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా.. మోడీ ఏం చేస్తారో!
9 hours ago

హింస సమాధానం కానేకాదు.. మెలనియా ట్రంప్ వీడ్కోలు సందేశం
10 hours ago

రైతులతో చర్చలు జనవరి 20కి వాయిదా.. పంతం వద్దన్న తోమర్
12 hours ago

రామమందిర నిర్మాణానికి డిగ్గీ రాజా సంచనల విరాళం
13 hours ago

రిపబ్లిక్ డే పెరేడ్లో మొట్టమొదటి మహిళా పైలట్..
14 hours ago

రైతుల ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే నిర్ణయం: సూచన
17 hours ago

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..!
18 hours ago

1075 ఈ నెంబర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్
17 hours ago

అమెరికా ఆన్ 'హై అలర్ట్'
16 hours ago
ఇంకా