newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

అమ్మ బాబోయ్.. మళ్లీ పెట్రోల్-డీజిల్ ధరలను పెంచారుగా..!

23-02-202123-02-2021 22:11:41 IST
Updated On 23-02-2021 11:00:21 ISTUpdated On 23-02-20212021-02-23T16:41:41.129Z23-02-2021 2021-02-23T05:20:36.543Z - 2021-02-23T05:30:21.592Z - 23-02-2021

అమ్మ బాబోయ్.. మళ్లీ పెట్రోల్-డీజిల్ ధరలను పెంచారుగా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు ఉండడంతో రోజువారీ పెట్రోలు ధరల పెరుగుదల నిలిచిపోతుందని మార్కెట్ నిపుణులు చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా పెట్రోల్ ధరలు పెరగలేదు కదా.. ఎన్నికలు పూర్తీ అయ్యే వరకూ పెట్రోల్ ధరలను ప్రభుత్వం సవరించకపోవచ్చు అని అనుకున్నారు.. ఆ ఆశలు కాస్తా ఆవిరైపోయాయి. వరుసగా 12 రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధర, రెండు రోజుల విరామం తరువాత, మంగళవారం నాడు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలుపై 36 పైసల వరకు, డీజిల్ పై 38 పైసల వరకూ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 90.93కు చేరగా, డీజిల్ ధర రూ. 81.32కు పెరిగింది. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 94.54కు డీజిల్ ధర రూ. 88.69కి చేరింది. బెంగళూరులో పెట్రోలు ధర రూ. 93.98కి, డీజిల్ ధర రూ. 86.21కి చేరింది. 

గడచిన 54 రోజుల్లో 25 సార్లు ధరలు పెరిగాయి. దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే మిడిల్ క్లాస్ ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ చెబుతున్నారు. తమ లాభాలను పెంచుకునేందుకు క్రూడాయిల్ ను వెలికితీస్తున్న ఒపెక్ దేశాలు ప్రొడక్షన్ కోతను అమలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. ఒపెక్ దేశాలు ఉత్పత్తిని పెంచితే, ధరలు తగ్గుతాయని అన్నారు. పెట్రో ధరల భారాన్ని కొంతైనా తగ్గించేలా పన్నులను ఉపసంహరించుకోవాలని పలు వర్గాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలోని సుంకాలను తగ్గించాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సుంకాలను తగ్గించారు.   కరోనా లాక్‌డౌన్‌ సమయంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ16 ఎక్సైజ్‌ డ్యూటీని పెంచింది కేంద్ర ప్రభుత్వం. దానిని ఉపసంహరించుకోవడానికి నిరాకరిస్తుంది.  రాజస్థాన్‌ ప్రభుత్వం జనవరి 29న 38 శాతంగా ఉన్న వ్యాట్‌ను 36 శాతానికి తగ్గించింది. దీంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది.

అసోం, మేఘాలయ, తాజాగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు కూడా ఇదే దారిలో పయనించాయి. అసోం ప్రభుత్వం గత ఏడాదిలో కోవిడ్‌-19పై పోరాడేందుకు నిధుల సేకరణ కోసం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 ట్యాక్స్‌ విధించింది. అయితే చమురు ధరలు పెరుగుతుండటంతో ఆ ట్యాక్స్‌ను ఫిబ్రవరి 12న ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో కొంతమేర ధరలు తగ్గాయి. మేఘాలయ ప్రభుత్వం కూడా భారీగా ధరలను తగ్గించింది. పెట్రోల్‌ డీజిల్‌పై రిబేట్‌ రూపంలో రూ.2లను తగ్గించగా, తర్వాత వ్యాట్‌ను పెట్రోల్‌పై 31.62 శాతం నుంచి 20 శాతానికి, డీజిల్‌పై 22.95 శాతం నుంచి 12 శాతానికి కుదించింది. దీంతో రాష్ట్రంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.40, డీజిల్‌పై రూ.7.10 తగ్గాయి.

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా

   an hour ago


కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ

   an hour ago


కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు

   2 hours ago


ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

   13 hours ago


భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!

   20 hours ago


గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్

   a day ago


మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండింగ్

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండింగ్

   26-02-2021


టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు

   18 hours ago


అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం

   26-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle