రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం లేదా..?
22-02-202122-02-2021 14:14:57 IST
Updated On 22-02-2021 10:06:35 ISTUpdated On 22-02-20212021-02-22T08:44:57.477Z22-02-2021 2021-02-22T04:30:19.277Z - 2021-02-22T04:36:35.592Z - 22-02-2021

ఇటీవలి కాలంలో భారత్ లో పెట్రోల్ ధరలు పెరుగుతూ వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే..! వరుసగా 12 రోజులు పెట్రోల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. 100 రూపాయల మార్క్ ను కూడా తగిలింది. దీంతో మధ్యతరగతి ప్రజలు లబోదిబోమని అంటున్నారు. నిత్యమూ లీటరుపై 30 పైసల నుంచి 40 పైసల వరకూ పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు, తాజాగా మారలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, భారత్ లో మాత్రం ధరలను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మార్చలేదు. అతి త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ధరలు పెరగలేదని తెలుస్తోంది.
కనీసం మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ, గతంలో ఎన్నికలు వచ్చిన సమయంలోనూ పెట్రో ధరలను రెండు, మూడు నెలల పాటు సవరించలేదు.. ఇప్పుడు కూడా అవే రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల పుణ్యమాని కొన్ని వారాల పాటు ధరలను పెంచే అవకాశాలు లేవని, ఈలోగా ఇంటర్నేషనల్ మార్కెట్ ధరల సరళిని పరిశీలించి, ఎన్నికల తరువాత తిరిగి ధరలను పెంచవచ్చని అంటున్నారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించేలా సుంకాలను తగ్గించినా, అది కేవలం రూ. 3 నుంచి రూ. 5 వరకే పరిమితమైంది.
ప్రజల నుంచి ధరల పెంపుపై వ్యతిరేకత పెరుగుతూ ఉండడంతో ఎక్సైజ్ సుంకాలను కొంత మేరకు ఉపసంహరించుకోవాలని ఎన్డీయే భావిస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెట్రో ధరల ప్రభావంతో మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న తీరు దోపిడీకి ఏం తీసిపోదని సోనియా అన్నారు. ప్రజలు ఎంతో బాధపడుతుంటే, ఆ విచారాన్ని కేంద్ర ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోందని.. ఆయిల్, గ్యాస్ ధరలు భగ్గుమంటుడం పట్ల ప్రతి పౌరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఉద్యోగాలు హరించుకుపోతున్నాయని, వేతనాలు తగ్గిపోతున్నాయని, కుటుంబ ఆదాయం పడిపోతోందని వివరించారు. నిత్యావసర వస్తువులు సైతం ధరలు పెరిగాయని, ప్రజలు ఇంతటి సమస్యల్లో ఉంటే ప్రభుత్వం మాత్రం లాభాల వేటకు ప్రాధాన్యత ఇస్తోందని వ్యాఖ్యానించారు.
ఇంత స్థిరంగా, ఏమాత్రం తగ్గుదల అన్నది లేకుండా చమురు ధరలు పెరగడం చరిత్రలో మునుపెన్నడూ లేదని సోనియా అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఓ మోస్తరుగా ఉన్న సమయంలో భారత్ లో చమురు ధరలు ఆకాశాన్నంటుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. గత ఆరున్నరేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇంధన ధరల పెంపుకు కారణం అని ఆరోపించారు. డీజిల్ పై 820 శాతం, పెట్రోల్ పై 258 శాతం ఎక్సైజ్ సుంకం పెంచారని, తద్వారా రూ.21 లక్షల కోట్ల మేర వసూలు చేశారని సోనియా వివరించారు.
ఇలా అయితే మధ్యతరగతి ప్రజలకు కష్టమే..!

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ
5 hours ago

73 ఏళ్ల పెద్దాయనకు పెళ్లి మోజు.. కోటి 30 లక్షలతో అమ్మాయి జంప్
5 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా
13 hours ago

ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు
14 hours ago

ఈ ఏడాదికి.. నారీ వారియర్ గా నామకరణం చేద్దాం
16 hours ago

దీదీపై మోదీ సెటైర్లు..!
07-03-2021

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!
07-03-2021

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ
07-03-2021

ఆ సీడీలు బయటకు రాకుండా ఉండడానికి 5 కోట్ల డీల్ కూడా కుదిరిందట..!
06-03-2021

సాగు చట్టాలను రద్దు చేయకుంటే 500 రోజులైనా ఆందోళనలు ఆపం.. రైతుసంఘాలు
06-03-2021
ఇంకా