newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

10-04-202110-04-2021 20:34:22 IST
Updated On 10-04-2021 17:35:26 ISTUpdated On 10-04-20212021-04-10T15:04:22.458Z10-04-2021 2021-04-10T11:59:25.066Z - 2021-04-10T12:05:26.377Z - 10-04-2021

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్, అమెరికా సంబంధాలను కుదుపుచేసిన ఘటన ఇది. ఇన్నాళ్లుగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారత సముద్రజలాల్లోకి అమెరికన్ నేవీ అనుమతి లేకుండా చొరబడింది. అయితే భారత ప్రభుత్వ అనుమతితో పనిలేకుండానే భారత్ ప్రత్యేక ఆర్థిక మండలంలో నేవిగేషన్ చేయగల హక్కు తనకు ఉందని అమెరికా నిఘా విభాగం పెంటగాన్ తేల్చి చెప్పింది.

అసాధారణ కదలికల్లో భాగంగా అమెరికా నావికా దళం బుధవారం భారత సముద్ర జలాల్లో స్వేచ్ఛగా నౌకా ఆపరేషన్ నిర్వహించింది. అనుమతి లేకుండా చేసిన ఈ సైనిక చర్యతో భారత్‌కు తన సముద్ర జలాలపై ఉన్న హక్కును అమెరికా సవాలు చేసింది. దీంతో భారత్ దౌత్య మార్గాల ద్వారా శుక్రవారం తన తీవ్ర ఆందోళనను అమెరికాకు తెలియజేసింది.

గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ యుఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ అనే అమెరికా నేవీకి చెందిన సెవెన్త్ ప్లీట్ నౌక ద్వారా భారత సముద్రజలాల్లో విహరించడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని తెలిపింది. సముద్రజలాలపై భారత్‌కు ఉన్న హక్కును, స్వాతంత్ర్యాన్ని, చట్టపరమైన కార్యకలాపాలను అమెరికా నేవీ ఆపరేషన్ భగ్నం చేసినట్లయింది.

అయితే అమెరికా నేవీ చేపట్టిన ఈ అసాధారణ చర్యపై భారత్ ప్రతిస్పందనపై పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం వివరణ ఇచ్చారు. అమెరికాకు చెందిన యుఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ అనే ఒక నౌకా విధ్వంసక నౌకకు మాల్దీవుల రిపబ్లిక్ పరిధిలో సంచరించే హక్కు, స్వాతంత్ర్యం ఉందని నేను చెబుతున్నాను. భారత్ ముందస్తు అనుమతి లేకుండానే దాని ప్రత్యేక ఆర్థిక మండలంలో సాధారణ కార్యకలాపాలు సాగించడానికి భారత ప్రాదేశిక సముద్ర జలాల్లో నిరపాయకరంగా తమ నౌక సంచరించిందని, ఆ స్వాతంత్ర్యం, హక్కు తమకు ఉందని అమెరికా పేర్కొంది.

ఎవర్ గివెన్ నౌక నడిపింది నేనా.. ఈ నిందలేమిటన్న మహిళా కెప్టెన్ మర్వా

భారత ప్రత్యేక ఆర్థిక మండలి లోపల ఉన్న లక్షద్వీప్ ఐలండ్ పశ్చిమాన 130 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికా నౌకా విధ్వంసక నౌక యుఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ ఏప్రిల్ 7న సంచరించిందని, ఇందుకుగాను తగిన నేవిగేషన్ హక్కులు, స్వాతంత్ర్యం తమకు ఉన్నాయని పెంటగాన్ ప్రతినిధి సమర్థించుకున్నారు.

అంతర్జాతీయ చట్టం ప్రకారమే భారత సముద్ర జలాల్లో సంచరించే, నౌకలు నడిపే, ఆపరేట్ చేసే హక్కును తాము ఇకముందు కూడా కొనసాగిస్తామని పెంటగాన్ నిర్ధారించింది.

అయితే అంతర్జాతీయ సముద్ర జలాల హక్కు చట్టం తమ ప్రత్యేక ఆర్థిక మండలంలో ముందస్తు అనుమతి లేకుండా సంచరించే, కార్యకలాపాలు సాగించే హక్కును, స్వేచ్ఛను ఎవరికీ కల్పించలేదని భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ప్రత్యేకించి ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉండే సైనిక నౌకలు ఒక దేశ ముందస్తు అనుమతి లేకుండా ఆ దేశ సౌర్వభౌమాధికారం అమలులో ఉండే సముద్రజలాల్లో తిరిగజాలవని, సైనిక చర్యలు నిర్వహించలేవని భారత్ తేల్చి చెప్పింది.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారం స్వీకరించాక అంతంతమాత్రంగానే ఉన్న ఇరుదేశాల సంబంధాలు ఈ ఘటనతో ఉద్రిక్తతతలకు కారణమవడం గమనార్హం.

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle