newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

సరిహద్దు ఘర్షణల్లో చైనా, పాక్‌లకు సమానపాత్ర: రక్షణమంత్రి రాజ్‌నాథ్

13-10-202013-10-2020 13:16:15 IST
2020-10-13T07:46:15.182Z13-10-2020 2020-10-13T07:46:09.889Z - - 21-10-2020

సరిహద్దు ఘర్షణల్లో చైనా, పాక్‌లకు సమానపాత్ర: రక్షణమంత్రి రాజ్‌నాథ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం ఏర్పడిన ఘర్షణలను చైనా, పాకిస్తాన్ రెండు దేశాలు పనిగట్టుకుని మరీ పెంచి పోషిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. భారత్‌కు ఇబ్బందులు కలిగించాలని ఉత్తర దిశ నుంచి పాకిస్తాన్, తూర్పు దిశ నుంచి చైనా ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అయితే, ఒక పథకంలో భాగంగానే పాక్, చైనా సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయని రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు.

లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మొత్తం 44 వారధులను రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్‌కు 7,000 కిలోమీటర్ల సరిహద్దు ఉందని తెలిపారు. నూతన బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వారు సులువుగా అక్కడికి చేరుకోగలుగుతారని వెల్లడించారు. 

అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మించనున్న 450 మీటర్ల సొరంగ మార్గం నెచిపూ టన్నెల్‌ నిర్మాణానికి ఆయన ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ను రాజ్‌నాథ్‌ ప్రశంసించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాకిస్తాన్, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూనే భారత్‌ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. 

పాకిస్థాన్‌ లాగే చైనా కూడా తయారైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. ఏదో ఉద్దేశంతో పనిగట్టుకుని సరిహద్దు వివాదాన్ని సృష్టించిందని ఆయన ఆరోపించారు. సరిహద్దుల్లో సమస్యల్ని ఎదుర్కోవడమే కాదు, అక్కడ మౌలిక వసతుల్నీ భారత్‌ భారీగా అభివృద్ధి చేస్తోంది. తూర్పు, ఉ త్తర సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మొదట పాకిస్థాన్‌, ఇప్పుడు చైనా. ఏదో ఉద్దేశంతో పనిగట్టుకుని వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఓవైపు కరోనా మహమ్మారిని, మరోవైపు ఈ రెండు దేశాల సవాళ్లను భారత్‌ స్థిరంగా ఎదుర్కొంటున్నాం అని రాజ్‌నాథ్‌ తెలిపారు. 

370 రద్దు వల్లే చైనా దురాక్రమణ.. ఫరూఖ్ వ్యాఖ్యలపై దుమారం

కొన్ని నెలల క్రితం నిర్బంధం నుంచి విడుదలైన జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకే లద్దాఖ్‌లో చైనా దురాక్రమణకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రాన్ని తరచూ విమర్శించే ఫరూక్‌ అబ్దుల్లా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంపై మాట్లాడారు. ‘ఆర్టికల్‌ 370 రద్దును చైనా ఎన్నటికీ ఆమోదించదు. చైనా తోడ్పాటుతో స్వతంత్ర ప్రతిపత్తిని పొందుతామనుకుంటున్నాం. సరిహద్దుల్లో చైనా పాల్పడే చర్యలన్నిటికీ ఆర్టికల్‌ 370 రద్దుతో వచ్చిన ఆగ్రహమే కారణం’అని పేర్కొన్నారు. 

కాగా పరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎంపీ ఫరూక్‌ జాతి వ్యతిరేక, దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. ఫరూక్‌ చైనా దురాక్రమణను సమర్థిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో ఆయన చైనాలో హీరో అయిపోయారని పేర్కొంది. ఆ పార్టీ ప్రతినిధి సంబిత్‌ మహాపాత్ర మాట్లాడుతూ.. రాజ్యాంగ పద్ధతిలో పార్లమెంట్‌ ఆమోదంతోనే ఆర్టికల్‌ 370ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీపై వ్యతిరేకతతోనే ఆయన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle