newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఆదుకున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు..

28-04-202128-04-2021 06:44:52 IST
Updated On 28-04-2021 07:44:26 ISTUpdated On 28-04-20212021-04-28T01:14:52.990Z27-04-2021 2021-04-27T17:02:27.658Z - 2021-04-28T02:14:26.821Z - 28-04-2021

ఆదుకున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతీయ రైల్వేలు పట్టాలపై పరుగులు పెట్టి ప్రాణ వాయువును వేలాదిమందికి అందించడం ద్వారా తమ నిరుపమాన పాత్రను మరోసారి రుజువు చేసుకున్నాయి. అనేక రాష్ట్రాలు ఏకకాలంలో కోవిడ్ బారినపడి ఆక్సిజన్ లేక అల్లాడుతున్న వేళ భారతీయ రైల్వేలు తమ భారతీయతను రుజువు చేసుకున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాలకు దాదాపు 450 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్ ను అందించాయి. ఆక్సిజన్ కొరత కారణంగానే ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాలలోని ఆసుపత్రులలో వందల సంఖ్యలో కోవిడ్ రోగులు మరణించారు.   

దేశవ్యాప్తంగా అన్ని మూలలకు విస్తరించిన ఏకైక రవాణా వ్యవస్థ రైల్వేలు కావడం వల్ల ఆరు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను కేంద్రం పట్టాలకు ఎక్కించింది. కోవిడ్ రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించి వారి ప్రాణాలను నిలబెట్టింది. ముఖ్యంగా ఢిల్లీకి తొలి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకు వచ్చింది. ఛత్తీస్ గఢ్ లోని జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ నుంచి ద్రవరూప ఆక్సిజన్ ను హస్తినకు తీసుకువచ్చారు. గత నాలుగు రోజులుగా ఆక్సిజన్ సమస్యే ప్రధాన కారణంగా కోవిడ్ కేసుల విషయంలో ఢిల్లీ ఆసుపత్రులు చేతులు ఎత్తేశాయి.   

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో ఆక్సిజన్ కొరత విషయాన్ని బాహాటంగానే ప్రస్తావించారు. ఈ మొత్తం ఆరు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లలో 26 ఆక్సిజన్ ట్యాంకర్లు ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఈ నెల 19 నుంచి దాదాపు 10వేల కిలోమీటర్ల మేర ఈ రైళ్లు నడిచాయి. మరో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా బొకారో నుంచి భోపాల్ వెళ్తోందని, ఇందులో ఉన్న 64 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తో మధ్య ప్రదేశ్ అవసరాలు కొంత మేరకు తీరుతాయని అధికారులు చెప్తున్నారు.   

అలాగే మరో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు ట్యాంకర్లను నింపుకొని ఉత్తరప్రదేశ్ చేరుకుంటుందని, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలకు రానున్న కొన్ని వారాలలో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపేందుకు రైల్వేలు సిద్ధమవుతున్నాయి. ఆక్సిజన్ అవసరాలు క్రమంగా తీరుతున్నందున ఇటు రైల్వేలతో పాటు ఇతరత్రా కూడా ప్రభుత్వాలు ప్రాణవాయువును అందిస్తున్నాయి కాబట్టి త్వరలోనే దీని కొరత కొంత మేర అయినా తీరగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కోవిడ్ కేసులు తీవ్రంగా ఉన్న రాష్ట్రాలకే ప్రధానంగా రైల్వేల ద్వారా ఆక్సిజన్ ను అందించడంపై కేంద్రం దృష్టి పెట్టింది.   

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

   25 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   an hour ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   6 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle