newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

భవిష్యత్తులోనూ ఇంటి నుంచి పని కొనసాగింపు.. అజీమ్ ప్రేమ్‌జీ

22-02-202122-02-2021 11:30:03 IST
Updated On 22-02-2021 11:32:22 ISTUpdated On 22-02-20212021-02-22T06:00:03.369Z22-02-2021 2021-02-22T06:00:01.049Z - 2021-02-22T06:02:22.680Z - 22-02-2021

భవిష్యత్తులోనూ ఇంటి నుంచి పని కొనసాగింపు.. అజీమ్ ప్రేమ్‌జీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భవిష్యత్తులో కూడా ఐటీ పరిశ్రమ రెండు రకాల పనివిధానాన్ని కొనసాగించవచ్చని ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. కోవిడ్-19 నియంత్రణకు గత సంవత్సరం మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విదించిన కొన్ని వారాల్లోనే దేశంలో 90 శాతంమందికి పైగా ఐటీ నిపుణులు ఇంటివద్దనుంచే పనిచేశారని, ఇప్పటికీ అది కొనసాగుతోందని ప్రేమ్ జీ చెప్పారు. సమీప భవిష్యత్తులో కూడా కొంత పని ఆఫీసు నుంచి మరికొంత పని ఇంటినుంచి జరిగే హైబ్రిడ్ పనివిధానం కొనసాగుతుందన్నారు.

కోవిడ్-19 మహమ్మారి పూర్తిగా ముగిసిపోయిన తర్వాత కూడా కార్యాలయంతో పాటు ఇంటి నుంచి పనిచేసే శాశ్వత హైబ్రిడ్ విధానం కొనసాగే అవకాశ ముందని ప్రేమ్ జీ స్పష్టం ఛేశారు. ఇది యాజమాన్యానికి, అటు ఉద్యోగులకు ఉభయత్రా ప్రయోజనకారిగా ఉంటోంది కనుక ఈ విధానం భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశమే ఎక్కువ అని చెప్పారు. పైగా అనువైన వేళల్లో పనిచేయాలనుకుంటున్న మహిళలకు ఇంటినుంచి పనిచేసుకునే విదానం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

పైగా హైబ్రిడ్ పనివిధానం భారీస్థాయి ప్రయోజనం కలిగిస్తోంది కాబట్టే ప్రభుత్వం కూడా ఇలాంటి ద్వంద్వ పనివిధానాన్ని ప్రశంసించిందని ప్రేమ్ జీ గుర్తుచేశారు. ఇది సమీకృత అభివృద్దికి తోడ్పడుతుందని, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఐటీ పనుల్లో భాగం పంచుకునే అవకాశం ఉంటోందని ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్ జీ అభిప్రాయపడ్జారు.

అలాగే కోవిడ్ 19 వ్యాక్సినేషన్ అమల్లో ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం ఇస్తే 60 రోజుల్లోపే దేశంలో 50 కోట్లమందికి వేగంగా టీకా వేయడం సాధ్యపడుతుందని ప్రేమ్ జీ సూచించారు. ఒక్కో టీకాను 300 రూపాయలకు ప్రేవేట్ సంస్థలకు ఇస్తే నర్సింగ్ హోమ్ చార్జీలు మరో వంద రూపాయలు కలుపుకుని రూ 400లకే టీకాను ఇవ్వడం సాద్యపడతుందని, కార్పొరేట్ సంస్థలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించాలని అబ్యర్థించారు. 

దాదాపు 35 రోజులపాటు టీకా ప్రక్రియ అమలు చేస్తున్నప్పటికీ దేశంలో కోటిమందికి మాత్రమే కోవిడి్-19 టీకాలు అందిన నేపథ్యంలో అజీమ్ ప్రేమ్ జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా

   an hour ago


కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ

   2 hours ago


కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు

   2 hours ago


ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

   14 hours ago


భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!

   21 hours ago


గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్

   a day ago


మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండింగ్

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండింగ్

   26-02-2021


టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు

   18 hours ago


అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం

   26-02-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle