ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?
05-12-202005-12-2020 20:38:04 IST
2020-12-05T15:08:04.073Z05-12-2020 2020-12-05T15:07:47.448Z - - 16-01-2021

హెల్మెట్ పెట్టుకోండి.. మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. కానీ ఎవ్వరూ వినడం లేదు. పెద్ద ఎత్తున ఛలానాలు పడ్డా కూడా కట్టుకుందాంలే అనుకునే అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు జనాలు. డ్రైవింగ్ చేసే వ్యక్తి మాత్రమే కాదు.. వెనకాల ఉన్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అన్న నిబంధనలను అధికారులు తీసుకుని వచ్చినా పాటించే వాళ్లే లేరు. ప్రజల్లో హెల్మెట్ పెట్టుకునేలా మార్పు తీసుకుని రావడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకుని వస్తోంది. బైక్ మీద ప్రయాణిస్తున్న వాళ్లు హెల్మెట్లు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందేనట.. ఒక వేళ హెల్మెట్లు లేకపోతే ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభయమిచ్చింది. హెల్మెట్ కొనలేని వారు మీ సమీప పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. మీ వివరాలు వారికి ఇస్తే.. మీకు హెల్మెట్ ఇస్తారని ఆమె తెలిపారు. ఇక ఆ రాష్ట్ర రాజధాని కోల్ కతాలో హెల్మెట్ లేకుండా పెట్రోల్ కొట్టించుకోవాలని అనుకుంటే అది మాత్రం కుదరదు.
హెల్మెట్ ధరించకపోతే.. బంకుల్లో వారికి పెట్రోల్ పొయకూడదంటూ కోల్‌కతా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 8 నుంచి కోల్‌కతా పరిధిలో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. హెల్మెట్ ధరించకుండా బంకుల్లోకి వచ్చే టూ వీలర్ వాహనాలకు పెట్రోల్ పోయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది కోల్ కతా పోలీసు విభాగం. డిసెంబర్ 8 నుంచి వచ్చే 2021 ఫిబ్రవరి 2 వరకు ఈ ఉత్తుర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు. హెల్మెట్ ను కొనలేని వారికి రాష్ట్ర ప్రభుత్వమే వాటిని అందజేస్తుందని దీదీ చెబుతోంది.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
44 minutes ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
8 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
6 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
9 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
10 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
10 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
11 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
12 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
12 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా