హమ్మయ్య.. తుఫాన్ తో భయం లే.. ఇక సేఫ్
27-11-202027-11-2020 10:14:08 IST
Updated On 27-11-2020 10:42:13 ISTUpdated On 27-11-20202020-11-27T04:44:08.730Z27-11-2020 2020-11-27T04:44:04.075Z - 2020-11-27T05:12:13.832Z - 27-11-2020

వారం రోజుల్నుంచి జనాల్ని టెన్షన్ పెట్టి చంపింది నివర్ తుఫాన్. వద్దు తల్లీ ఇటు రాకు మీకు దండాలు పెడతం అన్నా.. నెవర్ నెవర్ నేను ఇనా అనుకుంట వచ్చింది. తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్ లపై గట్టి ఎఫెక్ట్ పడింది. తెలంగాణపై కూడా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మొత్తానికైతే.. నివర్ కాస్త చల్లబడింది. స్పీడ్ తగ్గింది. ఇంకో నాలుగైదు గంటల్లో.. పూర్తిగా మాయం అవుతుందంట. తీరం ఆల్రెడీ దాటిన నివర్ తుఫాన్.. ప్రస్తుతానికి రాయలసీమ దక్షిణ ఏరియాలో లాక్ అయి ఉందంట. ఆ ఏరియాలోనే గిర్ర గిర్ర తిరుగుతుందంట. తీవ్ర వాయుగుండం నుంచి.. సాధారణ వాయుగుండంగా మారిన నివర్ తుఫాన్.. తర్వాత తర్వాత ఇంకాస్త కూల్ అయింది. ప్రస్తుతం అల్పపీడనంగా మారుతోంది. తర్వాత అలా అలా గాల్లో కలిసి పోతుంది. అదీ లెక్క. కాకపోతే.. ఇప్పుడప్పుడే వర్షాలు పోవు. ఇవ్వాళ ఒక్క రోజు వర్షాలు ఉంటాయ.ట. ఆల్రెడీ తుఫాన్ తాలూకూ ప్రభావం అలాగే ఉండడంతో.. రాయలసీమ, ఆంధ్ర లో వర్షాలు పడతాయట. రాయలసీమను ఆనుకుని ఉన్న తీరం వెంబడి జిల్లాల్లో కొంచెం అలర్ట్ గా ఉండాలట. ఎందుకంటే.. తీరంలో గంటకి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. విశాఖలో కూడా తీరం వెంబడి గాలులు ఇంకా స్పీడ్ తగ్గలేదు. సో.. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ సాయంత్రం దాకా వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి.. ఇవాళ కూడా తుఫాన్ ఉంది అనే ఫీలింగ్ తోనే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు ఆఫీసర్లు. బట్.. రేపటికి మాత్రం అంతా క్లియర్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు.

ఒకే వేదికపై మోదీ-మమతా
7 hours ago

రైతుల ఆందోళనలు.. తీర్మానాలు ఇక కష్టమే.. తోమర్
9 hours ago

రైతుల ఆందోళనపై ప్రభుత్వ వైఖరి భేష్.. 80 శాతం ప్రజల్లో సంతృప్తి
12 hours ago

వ్యాక్సిన్ల తయారీలో భారత్ స్వావలంబన.. ప్రధాని మోదీ
14 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్తగా 14,256 కరోనా కేసులు
15 hours ago

తాజా చర్చలూ విఫలం.. ఇక బంతి మీ కోర్టులోనే ఉందన్న కేంద్రం
16 hours ago

తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దొంగలను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
13 hours ago

మూడోసారి మోదీనే ప్రధాని.. తాజా సర్వేలో సంచలన విషయాలు
18 hours ago

వంద నోటుకి మూడింది.. వచ్చే నెలలో మాయం
16 hours ago

భారత్ వ్యాక్సిన్ దౌత్యం... చైనాకు చెక్ చెప్పడానికేనా?
22-01-2021
ఇంకా