newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

నవాజ్ షరీఫ్ ను ఒక రేంజిలో తిట్టిన ఇమ్రాన్ ఖాన్

18-10-202018-10-2020 16:16:28 IST
Updated On 18-10-2020 16:37:18 ISTUpdated On 18-10-20202020-10-18T10:46:28.975Z18-10-2020 2020-10-18T10:46:19.701Z - 2020-10-18T11:07:18.223Z - 18-10-2020

నవాజ్ షరీఫ్ ను ఒక రేంజిలో తిట్టిన ఇమ్రాన్ ఖాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఒక రేంజిలో తిట్టాడు. ఆర్మీ చీఫ్ బజ్వా తమ ప్రభుత్వాన్ని కూల్చి వేశారని నవాజ్ షరీఫ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఆర్మీ చీఫ్ బూట్లను శుభ్రం చేసి నవాజ్ షరీఫ్ అధికారాన్ని చేపట్టాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

2018లో ఇమ్రాన్ ఖాన్ ను ప్రధాని చేసేందుకు జనరల్ బజ్వా తమ ప్రభుత్వాన్ని పడగొట్టారని షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచేందుకు ఎన్నికల్లో రిగ్గింగ్ చేయించారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారని.. తమ ప్రభుత్వాన్ని బజ్వా కూల్చారని సంచలన ఆరోపణలు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ కు కోపమొచ్చింది. అందుకే నవాజ్ షరీఫ్ ను బూట్లు శుభ్రం చేసి గద్దెనెక్కావు అన్న పదాలను వాడారు. 

జనరల్‌ జియో ఉల్‌ హక్‌ 1980లలో మార్షల్‌లా విధించిన సమయంలో నవాజ్‌ షరీఫ్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టారని, ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. పాకిస్థాన్‌ కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న జవాన్లను అవమానించేలా షరీఫ్‌ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల భయంతోనే విదేశాలకు పారిపోయిన వ్యక్తి.. ఆర్మీ చీఫ్‌, ఐఎస్‌ఐ చీఫ్‌ గురించి మాట్లాడుతున్నారని ఇమ్రాన్‌ ఖాన్‌ మండిపడ్డారు.

పాకిస్థాన్ లో ప్రభుత్వం నిలబడాలంటే సైన్యంలోని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్లు కూడా ఏదైనా ఓ పార్టీ వెనుక ఉంటారనే ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో కూడా ఆర్మీ ఛీఫ్ లు పాకిస్థాన్ లో పెత్తనాన్ని కొనసాగించారు.  


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle