newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న మోదీ

08-04-202108-04-2021 10:19:02 IST
Updated On 08-04-2021 09:46:15 ISTUpdated On 08-04-20212021-04-08T04:49:02.078Z08-04-2021 2021-04-08T03:39:44.833Z - 2021-04-08T04:16:15.630Z - 08-04-2021

కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా రెండో డోస్ ను వేయించుకున్నారు. గత నెల ఒకటో తేదీన కరోనా టీకా తొలి డోసు తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ 37 రోజుల తర్వాత ఈ ఉదయం రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న ఆయనకు భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా రెండో డోసు ఇచ్చారు. ప్రధాన నర్సు పి. నివేదా మోదీ చేయిని పట్టుకోగా, మరో నర్సు నిషా శర్మ వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘ఎయిమ్స్‌లో ఈ ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నాను. వైరస్‌ను ఓడించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటి. టీకా వేయించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరు వెంటనే టీకా తీసుకోండి. కొవిన్ యాప్ ద్వారా టీకా కోసం రిజిస్టర్ చేసుకోండి’’ అని ఆ ట్వీట్‌లో మోదీ కోరారు. తొలి డోసు వేయించుకున్నప్పుడు మోదీ మాస్క్ లేకుండా కనిపించగా.. ఈసారి మాస్కుతో కనిపించారు. 

భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. వీలైనంత తక్కువ సమయంలో కరోనా వ్యాక్సిన్లు వేస్తూ దూసుకుపోతోంది భారత్. ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పనిచేసే ప్రదేశాల్లో కూడా కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 11 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. ఓ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలంటే కనీసం 100 మంది సిద్ధంగా ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 45 ఏళ్లకు పైబడినవారికి కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఈ నెలలో అనేక సెలవులు ఉన్నప్పటికీ, కరోనా టీకా డోసులను ప్రతిరోజు వేయాలని నిర్ణయించారు. 

కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందువల్ల దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల వయసు పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. ప్రస్తుతం 45 ఏళ్ళ వయసు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారని, కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నందువల్ల 18 సంవత్సరాల వయసు పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరింది. యుద్ధ ప్రాతిపదికపై వ్యాక్సినేషన్ జరిగే విధంగా వ్యూహాలను రూపొందించాలని కోరింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందించాలని డిమాండ్‌ తప్పని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పుకొచ్చారు. టీకా సరఫరాలో పరిమితులు ఉన్నంత కాలం ప్రాధాన్యక్రమంలోనే వ్యాక్సిన్‌ అందజేస్తామని తెలిపారు. 

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   11 hours ago


ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   15 hours ago


టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   21 hours ago


ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   21 hours ago


ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021


వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021


అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021


డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021


పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021


అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle