పీపీఈ కిట్ తో మోదీ.. వాక్సిన్ గురించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా..?
28-11-202028-11-2020 13:38:54 IST
Updated On 28-11-2020 14:01:59 ISTUpdated On 28-11-20202020-11-28T08:08:54.045Z28-11-2020 2020-11-28T08:08:48.223Z - 2020-11-28T08:31:59.601Z - 28-11-2020

భారత ప్రధాని మోదీ నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటన ప్రారంభమైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకుని, అక్కడి నుంచి జైడస్ క్యాడిలా పార్కుకు చేరుకున్నారు. ఆ సంస్థ అభివృద్ధి చేస్తున్న 'జైకోవ్-డి' టీకా ప్రయోగాలను మోదీ పరిశీలించారు. ఆ వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. మోదీ పీపీఈ కిట్ ధరించి అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి ల్యాబ్‌లను పరిశీలించారు. మోదీని చూసేందుకు జైడస్ బయోటెక్ పార్క్ వద్దకు స్థానిక ప్రజలు భారీగా తరలిరావడంతో వారికి మోదీ అభివాదం చేశారు. అహ్మదాబాద్ పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న 'కొవాగ్జిన్' వ్యాక్సిన్ పరిశీలించనున్నారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు తెలియజేశారు. హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీకి హకీంపేట విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. ఈ కార్యక్రమానికి ఐదుగురికి మాత్రమే అనుమతి లభించినట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామహంతి, హకీంపేట ఎయిర్‌పోర్టు ఆఫీస్ కమాండెంట్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఇక వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను పరిశీలించిన తర్వాత నరేంద్ర మోదీ ఏదైనా శుభవార్తను ప్రజలతో పంచుకుంటారేమోననే ఆసక్తి కూడా నెలకొంది.

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
6 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
4 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
7 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
8 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
8 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
10 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
10 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
10 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021

జోబైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో లేడీ గాగా, లోపెజ్ ప్రదర్శన
15-01-2021
ఇంకా