newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

రోజుకు 6 వేల కరోనా కేసులు.. మహారాష్ట్రలో తిరిగి లాక్‌డౌన్

20-02-202120-02-2021 09:45:52 IST
2021-02-20T04:15:52.356Z20-02-2021 2021-02-20T04:15:49.737Z - - 09-03-2021

రోజుకు 6 వేల కరోనా కేసులు.. మహారాష్ట్రలో తిరిగి లాక్‌డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఏ రాష్టంలోనూ లేనివిధంగా రోజుకు 4 నుంచి 6 వేల కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్న నేపత్యంలో మహారాష్ట్ర మరోసారి లాక్‌డౌన్ బాట పట్టింది. విదర్భ ప్రాంతంలోని అమరావతి, యావత్మాల్ జిల్లాల్లో పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పైగా ముంబైతోపాటు విదర్భప్రాంతంలోని రెండు జిల్లాల్లో సరికొత్త కరోనా నిబంధనలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

రాష్ట్ర ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించడంలో పరమ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తానని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా హెచ్చరించి 24 గంటలు కాకముందే అన్నంత పనీ చేశారు. గత పదిరోజులుగా రోజు 4 వేల పైగా కరోనా కేసులు నమోదవుతుండటం, కనీస జాగ్రత్తలు పాటించకుండా జనం విచ్చలవిడిగా రోడ్లమీద, రైళ్లలో తిరిగేస్తుండటంతో 10 నెలల తర్వాత మళ్లీ మహారాష్ట్రలో పరిస్థితి అదుపు తప్పింది. 

ఈ క్రమంలోనే విదర్భప్రాంతంలోని రెండు జిల్లాల్లో పదిరోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ ఉద్ధవ్ థాక్రే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అమరావతి జిల్లాలో మాత్రం వారాంతాల్లో లాక్ డౌన్ పాక్షికంగా సడలిస్తూ మినహాయింపు ఇచ్చారు. దేశ వాణిజ్యరాజధాని ముంబైలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం యంత్రాంగం సిద్ధమైంది. మాస్కులు లేకుండా బయట తిరిగేవారిని గుర్తించడానికి 300 మంది మార్షల్స్‌ని ముంబై కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ముంబైలో శుభకార్యాలు, సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తూ కూడా కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్రలో గత  పదినెలల కాలంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య: 20,81,520. మృతుల సంఖ్య 51,669. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే కేసులు, మృతుల సంఖ్య నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతుండగా మహారాష్ట్రలో పెరుగుతుండడంతో తాజా లాక్‌డౌన్‌ విధించారు. తాజాగా గురువారం 5,427 కేసులు నమోదయ్యాయి. 

ఫిబ్రవరి 28వ తేదీవరకు యావత్మాల్ జిల్లాలో విద్యాలయాలన్నీ మూసివేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండు జిల్లాల్లో రాత్రిళ్లు లాక్ డౌన్ విధించారు. పెళ్లిళ్లకు కేవలం 50 మందిని మాత్రమే అనుమతించడం ద్వారా జనం కదలికలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. కరోనా కేసులు పెరిగిపోవడంతో మహారాష్ట్ర సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలోనూ ప్రజలు దాదాపుగా మాస్కులు వదిలేయడంతో రాష్ట ఆరోగ్య శాఖ తీవ్రంగా హెచ్చరించింది.

కొత్త కరోనా వైరస్ రకమే ఈ బీభత్సానికి కారణమా..

మహారాష్ట్రలోని అమరావతి, అకోలా జిల్లాల్లో కరోనా వ్యాప్తికి కొత్త రకం కరోనా స్టెయిన్సే కారణమని తేలింది.  జన్యుపరంగా మారిన ఈ కొత్త రకం వైరస్‌ మరింత త్వరితంగా వ్యాప్తి చెందుతోందని కోవిడ్‌–19పై ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ సుభాష్‌ సలంఖే చెప్పారు. ఈ కొత్త స్ట్రెయిన్‌ సోకిన వెంటనే న్యుమోనియాలోకి దింపేస్తోందని, దీనివల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని తెలిపారు. 

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన అమరావతిలో 700 మందికి కరోనా పాజిటివ్‌ వస్తే అందులో 350 మందికి ఈ కొత్త రకం సోకిందని చెప్పారు. నాగపూర్‌ నుంచి ఔరంగాబాద్‌ వరకు ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ప్రజల నిర్లక్ష్యం వల్ల కూడా  కేసులు పెరిగిపోతున్నాయన్నారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు లేకుండా ప్రజలు తిరుగుతున్నారని చెప్పారు. ఈ కొత్త రకం దేశంలోని ఇతర ప్రాంతాలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. 

కాగా, మహారాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 5వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. హోటల్స్‌లో 50 శాతం సామర్థ్యం వరకే అనుమతి, ఒక భవనంలో అయిదు కంటే ఎక్కువ పాజిటివ్‌ కేసులు వస్తే సీజ్‌ చేయడం, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి వంటి నిబంధనలు ముంబై, నాగపూర్‌లలో అమలు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. కోవిడ్‌ నిబంధనల్ని కఠినంగా అమలు చేయడానికి మహారాష్ట్ర సర్కార్‌ మార్షల్స్‌ని రంగంలోకి దించింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు, మెట్రో రైళ్లలో, సిటీ బస్సు ప్రయాణికులు మాస్కులు ధరించకపోతే మార్షల్స్‌ వచ్చి బలవంతంగా మాస్కు పెట్టుకునేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర నీటి వనరుల సంరక్షణ శాఖ సహాయ మంత్రి బచ్చు కదూకి రెండోసారి కరోనా సోకింది. నెల  వ్యవధిలో ఆరుగురు మంత్రులకు కరోనా రావటం విశేషం.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ

   6 hours ago


73 ఏళ్ల పెద్దాయ‌న‌కు పెళ్లి మోజు.. కోటి 30 ల‌క్ష‌ల‌తో అమ్మాయి జంప్

73 ఏళ్ల పెద్దాయ‌న‌కు పెళ్లి మోజు.. కోటి 30 ల‌క్ష‌ల‌తో అమ్మాయి జంప్

   6 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా

   14 hours ago


ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు

ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు

   15 hours ago


ఈ ఏడాదికి.. నారీ వారియ‌ర్ గా నామ‌క‌ర‌ణం చేద్దాం

ఈ ఏడాదికి.. నారీ వారియ‌ర్ గా నామ‌క‌ర‌ణం చేద్దాం

   17 hours ago


దీదీపై మోదీ సెటైర్లు..!

దీదీపై మోదీ సెటైర్లు..!

   07-03-2021


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!

   07-03-2021


కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ

   07-03-2021


ఆ సీడీలు బయటకు రాకుండా ఉండడానికి 5 కోట్ల డీల్ కూడా కుదిరిందట..!

ఆ సీడీలు బయటకు రాకుండా ఉండడానికి 5 కోట్ల డీల్ కూడా కుదిరిందట..!

   06-03-2021


సాగు చట్టాలను రద్దు చేయకుంటే 500 రోజులైనా ఆందోళనలు ఆపం.. రైతుసంఘాలు

సాగు చట్టాలను రద్దు చేయకుంటే 500 రోజులైనా ఆందోళనలు ఆపం.. రైతుసంఘాలు

   06-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle