ఎంపీ మోహన్ దేల్కర్ హోటల్ గదిలో శవమై..!
22-02-202122-02-2021 17:51:08 IST
Updated On 22-02-2021 18:17:54 ISTUpdated On 22-02-20212021-02-22T12:21:08.961Z22-02-2021 2021-02-22T12:21:03.888Z - 2021-02-22T12:47:54.315Z - 22-02-2021

దాద్రా అండ్ నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ హోటల్ గదిలో శవమై కనిపించడం సంచలనం సృష్టించింది. ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న సీ గ్రీన్ సౌత్ హోటల్ గదిలో ఆయన విగతజీవుడిగా పడి వుండడాన్ని గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ గదిలో గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్ లభ్యమైనట్టు తెలుస్తోంది. 58 ఏళ్ల మోహన్ దేల్కర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోహన్ చనిపోయినట్లు సమాచారం అందగానే మెరైన్ డ్రైవ్ లో ఉన్న సీ గ్రీన్ హోటల్ కు పోలీసులు హుటాహుటిన తరలివెళ్లారు. అక్కడే మోహన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. 58 సంవత్సరాల మోహన్ దేల్కర్ ఇండిపెండెంట్ గా నిలబడి పార్లమెంట్ మెంబర్ గా గెలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. ముంబైలో పని ఉండడంతో మోహన్ దేల్కర్ వచ్చారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన మరణించారని తెలియగానే పలువురు సంతాపం ప్రకటించారు. మరణానికి సంబంధించిన కారణాలు తెలియరావాల్సి ఉంది. మోహన్ దేల్కర్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004 నుండి మోహన్ దాద్రా నాగర్ హవేలీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో భేటీ తర్వాత దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలకు మోహన్ దేల్కర్ జేడీయూతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జేడీయూకు ఆయన మద్దతు ఇవ్వడం వల్ల దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. సిల్వస్సా ప్రాంతంలో ఓ వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించిన మోహన్ దేల్కర్ రాజకీయాల్లో విశేష ప్రభావం చూపించారు. మోహన్ దేల్కర్ ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ ను వీడారు. ప్రస్తుతం ఆయన స్వతంత్ర ఎంపీగా ఉన్నారు. గతేడాది దాద్రా నగర్ హవేలిలో స్థానిక ఎన్నికల కోసం జేడీయూతో పొత్తు పెట్టుకున్నారు.

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు
4 hours ago

కరోనా టీకాపై ఆంక్షల తొలగింపు.. ఇకపై 24 గంటలూ టీకా
5 hours ago

ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ
5 hours ago

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్
6 hours ago

తాజ్ మహల్ లో బాంబు పెట్టాను.. ఇంకొద్ది సేపట్లో..!
7 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!
9 hours ago

ఫ్రెంచ్ యువతిని రేప్ చేసిన ఢిల్లీ మహిళ.. కేసు నమోదు
8 hours ago

రాసలీలల మంత్రిగారు.. రాజీనామా చేసేశారు
03-03-2021

హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!
03-03-2021

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా..!
03-03-2021
ఇంకా