newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నా మాస్క్ వాడాల్సిందే.. ఢిల్లీ హైకోర్ట్

07-04-202107-04-2021 17:21:21 IST
2021-04-07T11:51:21.127Z07-04-2021 2021-04-07T11:51:18.283Z - - 11-04-2021

ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నా మాస్క్ వాడాల్సిందే.. ఢిల్లీ హైకోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒంటరిగా కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే మీ సొంత భద్రత కోసం మాస్క్ వాడటాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా ఎమ్ సింగ్ హితవు చెప్పారు. కారు కూడా పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఒకరే డ్రైవ్ చేస్తున్న సమయంలో కూడా మాస్క్ ధరించడం తప్పనిసరి అని హైకోర్టు తేల్చి చెప్పింది. 

మాస్క్ అనేది ఒక సురక్షిత కవచం. మాస్క్ ధరించిన వారికే కాకుండా వారి చుట్టూ ఉన్న వారికి కూడా అది రక్షణ నిస్తంది అని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఒంటరిగా డ్రైవ్ చేస్తున్న సమయంలోనూ మాస్క్ ధరించలేదని ఫైన్ వేసిన కేసు విచారణ సందర్భంగా మహిళా న్యాయమూర్తి ప్రతిభా సింగ్ తన నిర్ణయం ప్రకటించారు.

మీరు కారులో ఒక్కరే ఉంటూ డ్రైవ్ చేస్తున్న సమయంలో కూడా మీ సొంత భద్రత కోసం మాస్క్ ధరించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దేశంలో మళ్లీ వైరస్ పెరుగుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా, వేసుకోకపోయినా దేశంలోని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని సూచించారు.

కోవిడ్‌కు వ్యతిరేకంగా సురక్షితంగా ఉండాలంటే మాస్క్ ధరించడమనేది ప్రతి ఒక్కరి కనీస విధిగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి కదా అని న్యాయమూర్తి ఎత్తి చూపారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు అపిన సమయంలో కారు డ్రైవర్ తరచుగా విండో తెరుస్తారని, కరోనా వైరస్ ఎంత అంటు వ్యాధి అంటే అలాంటి సమయంలో కూడా వైరస్ బారిన పడే ప్రమాదముందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

తాను ఒంటరిగా కారు డ్రైవ్ చేస్తున్ననప్పుడు ఢిల్లీ పోలీసులు తనను ఆపి మాస్క్ ధరించలేదని 500 రూపాయలు జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ లాయర్ సౌరభ్ శర్మ న్యాయస్థానాన్ని సంప్రదించిన సందర్భంగా న్యాయమూర్తి ఇలా ఆదేశమిచ్చారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోర్టుకు తన సమాధానమిస్తూ ఒంటరిగా కారు డ్రైవ్ చేసేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే నిబంధన ఏదీ లేదని చెప్పింది. అయితే ప్రతి రాష్ట్రం కూడా తన సొంత నిబంధనలను, చట్టాలను రూపొందించి అమలు చేసే హక్కు కలిగి ఉంటుందని స్పష్టం చేసింది.

ఢిల్లీ నగరంలో ప్రైవేట్, ప్రభుత్వ వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలంటూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం గత సంవత్సరం ఏప్రిల్ లోనే ఒక ఆదేశం జారీ చేసింది.

అయితే ఢిల్లీ ప్రభుత్వం అలాంటి ఆదేశాన్ని జారీ చేసినప్పటికీ ఒంటరిగా కారు నడుపుతున్న వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిందని పిటిషనర్ వాదించారు.

లాయర్ సౌరభ్ శర్మతో పాటు మరో ఇద్దరు కూడా మాస్క్ లేకుండా కారు నడిపినందుకు గాను ఢిల్లీ పోలీసులు రూ.500 జరిమానా విధించారని కోర్టులో సవాలు చేశారు. పైగా పోలీసులు మానసికంగా తమను వేధించారని ఫిర్యాదు చేశారు కూడా.

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   10 hours ago


ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   14 hours ago


టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   20 hours ago


ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   21 hours ago


ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021


వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021


అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021


డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021


పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021


అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle