newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అనుమతులు కావాల్సిందే.. పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం..!

07-04-202107-04-2021 13:48:54 IST
Updated On 07-04-2021 09:51:26 ISTUpdated On 07-04-20212021-04-07T08:18:54.790Z07-04-2021 2021-04-07T03:35:50.548Z - 2021-04-07T04:21:26.040Z - 07-04-2021

అనుమతులు కావాల్సిందే.. పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాను అందరూ తేలికగా తీసుకోవడంతో ఒక్కసారిగా తీవ్ర ప్రభావం చూపించడం మొదలైంది. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కరోనా కోరల్లో చిక్కుకున్నారు ప్రజలు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంది. మొదట ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించినా కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో పాక్షిక లాక్ డౌన్ ను ప్రస్తుతానికి అనుమతి ఇస్తోంది. అయితే ఈ సరికొత్త లాక్ డౌన్ ముందుగా పెళ్లిళ్లు పెట్టుకున్న వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముందుగా నిశ్చయించుకున్న ప్రకారం పెళ్లిలు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్‌ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాణీ ప్రజలకు సూచించారు. కరోనా నియంత్రణకు సంబంధించిన పోలీసులు మార్గదర్శకాలు సూచిస్తారని..పెళ్లి పూర్తయ్యే వరకు పోలీసుల నిఘా ఉంటుందని, ఒకవేళ నియమాలు ఉల్లంఘించినట్లు వారి దృష్టికి వస్తే పెళ్లి మండపంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.  

ముంబై నగరంలో లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఇప్పటికే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నవారు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఫంక్షన్‌ హాళ్లు బుకింగ్, డెకొరేషన్, కేటరింగ్‌ సర్వీసులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చారు. పెళ్లికి ఇరువైపుల నుంచి 50 మంది బంధువులు మాత్రమే హాజరుండాలనే నియమాలున్నాయి.  పగలు 144 సెక్షన్, రాత్రుల్లో నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు పెళ్లి ఇళ్లల్లో అయోమయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. 

గతంలో బీఎంసీ నుంచి అనుమతి తీసుకుని పెళ్లి తంతు పూర్తి చేసేవారు. కరోనా నియమాలు ఉల్లంఘిస్తే బీఎంసీ సిబ్బంది చర్యలు తీసుకునేది. ఇప్పుడు స్థానిక పోలీసుల నుంచి కూడా అనుమతి తీసుకోవాలట. అందరూ కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. భౌతికదూరం పాటించాలి. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలనే నియమాలున్నాయి. వీటన్నింటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు, మళ్లీ 30వ తేదీన పెళ్లిలకు శుభ ముహూర్తాలున్నాయి. ఈ రోజుల్లో ఎక్కువ పెళ్లిలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో ఆ సమయంలో కూడా కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. 

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   9 hours ago


కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   13 hours ago


రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   15 hours ago


సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   21 hours ago


మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   a day ago


ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   18 hours ago


దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021


ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021


ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle