ఐటీ ఉద్యోగులకూ, సంస్థలకూ ఇంటినుంచి పనితోటే లాభం.. తాజా సర్వే
02-01-202102-01-2021 19:56:17 IST
2021-01-02T14:26:17.046Z02-01-2021 2021-01-02T14:24:13.286Z - - 20-01-2021

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం మానేసి 9 నెలలు కావస్తోంది. ఆఫీసులకు రావడం మానేశారు కానీ ఉద్యోగాలకు మానలేదు. కోవిడ్19 ఎన్నిరకాలుగా ప్రపంచాన్ని దెబ్బ తీసిందో కానీ ఐటీ ఉద్యోగులకు, ఐటీ సంస్థలకు కూడా మేలుకలిగించింది. సంస్థలు మౌలిక వ్యవస్థాపనా ఖర్చులు బాగా మిగిలించుకోగా, ప్రయాణాలు, వైరస్ వ్యాప్తి భయాలు లేకుండా ఐటీ ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తూ కుటుంబానికి దగ్గరగా ఉండటం అనే స్వేచ్ఛను సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, సంస్థలు కూడా ఈ సంవత్సరం తొలి ఆరునెలలూ ఇంటినుంచి పనినే కొనసాగించడం పట్ల ఆసక్తి చూపుతున్నారని తాజా సర్వే తెలిపింది. కోవిడ్19 రూపాంతరం చెంది కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న నేపథ్యంలో వర్క్ ఫ్రం ఆఫీసు అనేది నూరు శాతం సాధ్యం కాదని ఐటీ కంపెనీలు తేల్చివేశాయి. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఇదే విషయం బయటపడింది. 2020 ఏప్రిల్ నుంచి దేశంలో ఐటీ, ఐటీ సేవల రంగ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. కంపెనీనిబట్టి 20 శాతం లోపు మాత్రమే సిబ్బంది కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని ఈ సర్వే తేటతెల్లం చేసింది. వర్క్ ఫ్రం ఆఫీస్ నూరు శాతం అసాధ్యం. అదే సమయంలో కీలక విభాగాల ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. ఇతరులు మాత్రం ఇంటిలోనే పని చేసేందుకు వీలు కల్పిస్తారు. కంపెనీల వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రణాళికలు కోవిడ్–19 వ్యాక్సినేషన్, వీటి ఫలితాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది. గడిచిన తొమ్మిది నెలల కాలంలో 20 శాతం పెద్ద కంపెనీలు కొంత ఆఫీస్ స్థలాన్ని ఖాళీ చేశాయి. ఇంటినుంచి పనిలో మరింత ఉత్పాదకత ఉద్యోగుల్లో 50 శాతం వరకు హైదరాబాద్ వెలుపల వారివారి స్వస్థలాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు చెందినవారు కావడంతో ఆఫీస్కు తిరిగి వచ్చి పని చేసే విషయం సంక్లిష్టంగా మారింది. వారు తిరిగి రావడానికి మరికొంత సమయం పడుతుంది. వర్క్ ఫ్రం హోం విధానంలోనూ ఉత్పాదకత మెరుగ్గా ఉంది. మహమ్మారి ముందస్తు రోజులతో పోలిస్తే ఉత్పాదకత 90 శాతంపైగా ఉందని 63 శాతం కంపెనీలు వెల్లడించాయి. కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత 100 శాతం దాటింది. సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల్లో.. 500 లోపు ఉద్యోగులున్నవి 63 శాతం, 501–1000 సిబ్బంది ఉన్నవి 11 శాతం, 1,000కిపైగా ఎంప్లాయ్స్ ఉన్నవి 26 శాతమున్నాయి. వర్క్ ఫ్రం ఆఫీస్ 0.5 శాతం ఉందని 75 శాతంపైగా పెద్ద ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు తెలిపాయి. కరోనా కొత్త రూపంలో వస్తోన్న నేపథ్యంలో 2021 మార్చి నాటికి 20 శాతంలోపు ఉద్యోగులను మాత్రమే కార్యాలయం నుంచి పని చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్టు 60 శాతం కంపెనీలు వెల్లడించాయి. జూన్ నాటికి దీనిని 40 శాతం వరకు చేయనున్నాయి. పెద్ద సంస్థలు డిసెంబర్ చివరి నాటికి 50–70 శాతం ఉద్యోగులను కార్యాలయం నుంచి పని చేయించాలని ఆలోచిస్తున్నాయి. అంతే కానీ నూరు శాతం వర్క్ ఫ్రం ఆఫీస్ వీలవుతుందని ఏ కంపెనీ కూడా చెప్పకపోవడం గమనార్హం. అత్యవసర విభాగాలు, కీలక ఉద్యోగులను మాత్రమే ఆఫీస్ నుంచి పని చేయిస్తామని 75 శాతం పెద్ద కంపెనీలు తెలిపాయి. వారంలో కొన్ని రోజులు మాత్రమే ఆఫీస్ నుంచి విధులు ఉండేలా కూడా ఏర్పాట్లు చేయనున్నాయి. క్లయింట్ల అత్యవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కొన్ని కంపెనీలు తెలిపాయి.

వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం
4 hours ago

సరిహద్దుల్లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా.. మోడీ ఏం చేస్తారో!
10 hours ago

హింస సమాధానం కానేకాదు.. మెలనియా ట్రంప్ వీడ్కోలు సందేశం
11 hours ago

రైతులతో చర్చలు జనవరి 20కి వాయిదా.. పంతం వద్దన్న తోమర్
12 hours ago

రామమందిర నిర్మాణానికి డిగ్గీ రాజా సంచనల విరాళం
14 hours ago

రిపబ్లిక్ డే పెరేడ్లో మొట్టమొదటి మహిళా పైలట్..
15 hours ago

రైతుల ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే నిర్ణయం: సూచన
18 hours ago

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..!
18 hours ago

1075 ఈ నెంబర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్
17 hours ago

అమెరికా ఆన్ 'హై అలర్ట్'
17 hours ago
ఇంకా