దీదీ కరుణించింది.. ఇతర రాష్ట్రాలు ఏమి చేస్తాయో..!
22-02-202122-02-2021 15:55:09 IST
Updated On 22-02-2021 12:35:16 ISTUpdated On 22-02-20212021-02-22T10:25:09.311Z22-02-2021 2021-02-22T06:28:20.871Z - 2021-02-22T07:05:16.431Z - 22-02-2021

పెట్రోల్ ధరలు రోజు రోజుకీ పెరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! భారత్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల కారణంగా పెట్రోల్ ధరలు ఆకాశంలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోలు, డీజిల్‌పై విధిస్తున్న పన్నును ఒక రూపాయి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాత్రి నుంచే తగ్గింపు ధరలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రా ప్రకటించారు. పెట్రో ధరల తగ్గింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న మరుసటి రోజే మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై పన్నుల రూపంలో కేంద్రం రూ. 32.90 తీసుకుంటోందని, అదే సమయంలో రాష్ట్రాలకు లభిస్తున్నది రూ. 18.46 మాత్రమేనని మమత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సొంత వనరులను కేంద్రం దోచుకుంటోందని ఆరోపించింది. ప్రభుత్వానికి నష్టం కలిగినా ప్రజలపై భారం మోపకుండా ఉండాలనే పెట్రోలు, డీజిల్‌పై పన్నును తగ్గించామని మమతా ప్రభుత్వం చెబుతోంది. నిత్యమూ లీటరుపై 30 పైసల నుంచి 40 పైసల వరకూ పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు, తాజాగా మారలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, భారత్ లో మాత్రం ధరలను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మార్చలేదు. అతి త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ధరలు పెరగలేదని తెలుస్తోంది.కనీసం మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ, గతంలో ఎన్నికలు వచ్చిన సమయంలోనూ పెట్రో ధరలను రెండు, మూడు నెలల పాటు సవరించలేదు.. ఇప్పుడు కూడా అవే రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల పుణ్యమాని కొన్ని వారాల పాటు ధరలను పెంచే అవకాశాలు లేవని, ఈలోగా ఇంటర్నేషనల్ మార్కెట్ ధరల సరళిని పరిశీలించి, ఎన్నికల తరువాత తిరిగి ధరలను పెంచవచ్చని అంటున్నారు.

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా
an hour ago

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ
2 hours ago

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు
2 hours ago

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!
14 hours ago

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్
21 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!
21 hours ago

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్
a day ago

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్లో ట్రెండింగ్
26-02-2021

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు
18 hours ago

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం
26-02-2021
ఇంకా