newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

13-05-202113-05-2021 07:25:09 IST
Updated On 13-05-2021 07:29:52 ISTUpdated On 13-05-20212021-05-13T01:55:09.925Z12-05-2021 2021-05-12T14:45:12.961Z - 2021-05-13T01:59:52.309Z - 13-05-2021

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో వైరస్ బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని కోవిడ్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేందుకు  వీలుకల్పించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఆమె వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి బెంగాల్ లో స్ధలాన్ని కేటాయిస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. దేశంలో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని,  అలాగే దీని నుంచి ప్రజలను కాపాడే వ్యాక్సిన్ల ఉత్పత్తి లభ్యత తక్కువగా ఉందని ఆమె అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సంస్థలు పెరిగాయని, వాటి నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు అన్ని విధాలుగా కేంద్రం దోహదం చేయాలని అన్నారు. ఏ సంస్థ నుంచయితే విశ్వసనీయ వ్యాక్సిన్ లభ్యమవుతుందో అలాంటి వాటిని గుర్తించి దిగుమతి ప్రక్రియ వేగాన్ని పెంచాలని ఆయన కోరారు. అలాగే దేశంలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ఈ అంతర్జాతీయ సంస్థలను ప్రోత్సహించాలని కూడా మమతా బెనర్జీ ప్రధానిని కోరారు. అలా ముందుకు వచ్చే సంస్థలకు రాష్ట్రంలో స్థలాన్ని ఇవ్వడానికి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

దేశంలో గత 24 గంటల్లో దాదాపు మూడున్నర లక్షలకు పైగా కొత్త  కేసులు నమోదయ్యాయి. మరణాలు నాలుగు వేలకు పైనే ఉన్నాయి. దేశంలోని ఏడు వందలకు పైగా జిల్లాల్లో 553 జిల్లాలలో కోవిడ్  పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీనిని బట్టి చూస్తే గ్రామీణ భారతంలో ఈ వైరస్ చాలా వేగంగానే వ్యాపించినట్లు స్పష్టమవుతోంది. కోవిడ్ వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న మొదటి అయిదు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం అక్కడ ఆక్సిజన్ పరంగాను, ఇతరత్రా కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతోంది.

గ్రామీణ భారతంపై కోవిడ్ పంజా విసరడం వల్ల ఆర్ధిక పరమైన రికవరీ మరింత జాప్యం కాగలదన్న ఆందోళనను ఆర్ధిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్  వ్యాక్సిన్ దిగుమతులను ముమ్మరం చేయడంతో పాటు దేశీయంగా వీటి ఉత్పత్తులను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు విదేశీ సంస్థలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు స్థలాన్ని కేటాయిస్తామని మమతా బెనర్జీ ముందుకు వచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కోవిడ్ కు విరుగుడు టీకాలేనన్న భావన పెరగడంతో దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోవడంపైనే దృష్టి పెట్టాయి.     

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle