ఇవాళే మకరజ్యోతి దర్శనం
14-01-202114-01-2021 10:55:21 IST
2021-01-14T05:25:21.998Z14-01-2021 2021-01-14T05:24:06.243Z - - 24-01-2021

శబరిమలలో మకరజ్యోతి దర్శనాన్ని అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. జ్యోతి దర్శనం కోసం భక్తులు ఏడాదంతా ఎదురుచూస్తారు. ఆకాశంలో ఆ అద్భుతం కనిపించగానే భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. సాధారణంగా ప్రతి ఏడాది ఈ సీజన్లో లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకునేవారు. కరోనా నేపథ్యంలో ఈసారి మకర విలక్కు పండగపై ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతి ఇస్తోంది. అయ్యప్పస్వామికి మకర సంక్రాంతి ఎంతో ఇష్టమైనది. తనకు ఇష్టమైన ఈరోజున తాను ఆకాశంలో జ్యోతిరూపంలో దర్శనం ఇస్తానని అయ్యప్పస్వామి చెప్పారని చరిత్ర చెబుతోంది. అందుకే అయ్యప్పస్వామి మాల వేసిన ప్రతి భక్తుడు మకర సంక్రాంతిన శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని, మకరజ్యోతిని చూడాలని ఆశపడుతుంటారు. ఈసారి శబరిమలలో ఎంతో సాధారణంగా మకరవిలక్కు జరగనుంది. కేవలం ఐదు వేల మంది భక్తులు, అర్చకులు, అధికారుల సమక్షంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. శబరిమల చరిత్రలోనే మొదటిసారి మకరసంక్రాంతిన ఇలా నిరాడబరంగా పూజలు జరుగుతున్నాయి.
అయ్యప్పస్వామికి ఎంతో ఇష్టమైన బంగారు నగలు తీసుకెళ్లే తిరునాభరణం కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ ఊరేగింపు పందలంలోని వయియాకోయక్కల్ ధర్మస్థ ఆలయం నుంచి ప్రారంభమైంది. మకర సంక్రాంతి నాటికి అయ్యప్పస్వామి సన్నిధానానికి ఈ ఊరేగింపు చేరుకోనుంది. ఇవాళ మకరజ్యోతి దర్శనం సందర్భంగా శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. మకర సంక్రాంతి పూజలు, మకర జ్యోతి దర్శనం అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ వెల్లడించింది. కరోనా నిబంధనల దృష్టా రోజుకు 5వేల మంది భక్తులకు మాత్రమే దర్శన సౌకర్యం కల్పించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కొవిడ్ నెగిటివ్ రిపోర్టును తీసుకువెళ్లాలి. శబరిమలలో ఆలయంలో ఇవాళ స్వామివారికి జరిగే మకరవిలక్కు, మహాదీపారాధనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుభరణంతో అలంకరించిన స్వామివారి ఊరేగింపు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఆలయ బోర్డు. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు నిర్మల్య దర్శనం ప్రారంభం అయింది. తర్వాత మండపంలో గణపతి హోమం జరిగింది. ఉదయం ఏడున్నరకు ఉషా పూజ జరిగింది. ఇక స్వామివారికి నిర్వహించే మకరసంక్రమణ పూజకు ప్రత్యేకత ఉంది. ట్రావెన్కోర్ రాజ్యం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కొబ్బరికాయలు నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ పూజ తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కాలినడక మార్గం మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. సాయంత్రం 5:15 గంటలకు దేవస్థానం ప్రతినిధులు శారాంకుతికి వెళ్లి తిరుభరణ ఉరేగింపునకు స్వాగతం పలుకుతారు. సాయంత్రం ఆరున్నరకు మకరసంక్రాంతి సందర్భంగా తిరువభరణంతో దీపారాధన జరుగుతుంది. దీపరాధన ముగింపులో, మకరవిలక్కు పొన్నంబలం వద్ద వెలిగిస్తారు. తర్వాత ఎంతో అద్భుతమైన ఘట్టం.. మకర జ్యోతి ఆకాశంలో కనిపిస్తుంది.
కరోనా నేపథ్యంలో శబరి దర్శనాల విషయంలో ఈ సారి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక చర్యలు చేపట్టింది. ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్లు ఉన్న వారిని మాత్రం లోపలికి అనుమతిస్తారు. ఇక నిలక్కల్ సెంటర్ వద్ద కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాలి. లేని వారిని అనుమతించరు. అక్కడ టెస్ట్లు చేయరు. అందుకే బయటి నుంచే కోవిడ్ పరీక్షలు చేయించుకొని రిపోర్టును వెంట తీసుకురావాలి. 48 గంటల్లోపు తీసిన కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్ చెల్లదు. ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షను చేయించుకోవాలి. మకర జ్యోతి కనిపించే సమయంలో.. సన్నిధానం, ఆ పరిసరాలు ఆశ్రయ మంత్రాలతో అస్పష్టంగా ఉంటాయి. అప్పుడు పద్దెనిమిదవ దశకు అధిరోహణ ప్రారంభమవుతుంది. ఇది ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో జరుగుతుంది. శరణకుట్టి ఆరోహణ 19 న జరుగుతుంది. 19 వ తేదీ వరకు మాత్రమే భక్తులకు కలియుగవారదాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ నడక మార్గం 20వతేదీన ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు గణపతి హోమం జరుగుతుంది. రాజ కుటుంబ సభ్యుల దర్శనం తరువాత హరివరసాన గానంతో మరుసటి రోజు ఉదయం ఆరున్నరగంటలకు ఊరేగింపు ముగుస్తుంది. దీంతో మకరవిలక్కు పండుగ ముగుస్తుంది.

ఒకే వేదికపై మోదీ-మమతా
7 hours ago

రైతుల ఆందోళనలు.. తీర్మానాలు ఇక కష్టమే.. తోమర్
9 hours ago

రైతుల ఆందోళనపై ప్రభుత్వ వైఖరి భేష్.. 80 శాతం ప్రజల్లో సంతృప్తి
12 hours ago

వ్యాక్సిన్ల తయారీలో భారత్ స్వావలంబన.. ప్రధాని మోదీ
14 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్తగా 14,256 కరోనా కేసులు
15 hours ago

తాజా చర్చలూ విఫలం.. ఇక బంతి మీ కోర్టులోనే ఉందన్న కేంద్రం
16 hours ago

తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దొంగలను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
13 hours ago

మూడోసారి మోదీనే ప్రధాని.. తాజా సర్వేలో సంచలన విషయాలు
19 hours ago

వంద నోటుకి మూడింది.. వచ్చే నెలలో మాయం
17 hours ago

భారత్ వ్యాక్సిన్ దౌత్యం... చైనాకు చెక్ చెప్పడానికేనా?
22-01-2021
ఇంకా