newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

బడా సంస్థలకే కోవిడ్ రికవరీ నిధులు.. ఎఫ్ టి సి అంచనా

24-04-202124-04-2021 13:47:58 IST
2021-04-24T08:17:58.776Z24-04-2021 2021-04-24T08:17:41.867Z - - 25-07-2021

బడా సంస్థలకే కోవిడ్ రికవరీ నిధులు.. ఎఫ్ టి సి అంచనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్క భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కోవిడ్ మహమ్మారి ప్రభావానికి లోనై ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా కుదేలైపోతున్నాయి. మందులు లేక ప్రాణవాయువు రాక ఆదుకునే వాళ్ళు లేక జనం వేలాదిగా మృతువాత పడుతున్నారు. ఏ దేశానికి ఆ దేశం వందల కోట్ల రూపాయలను బాధితుల కోసం, వారి ప్రాణాలు రక్షించడం కోసం ఖర్చుపెడతామని చెబుతోంది. ఇంతకీ భారత దేశం సహా అనేక వర్ధమాన దేశాలకు అందుతున్న కోవిడ్ 19 రికవరీ నిధులు ఏమవుతున్నట్లు? ఈ వర్ధమాన దేశాలకు పంపిణీ చేస్తున్న నిధుల్లో మెజారిటీ భాగం పెద్ద కార్పొరేట్ సంస్థల జేబుల్లోకి వెళుతోందని తాజాగా వెలుగు చూసిన ఒక నివేదిక స్పష్టం చేస్తోంది.

రోజువారీ ఆదాయంపై బతుకుతున్న వారి సంక్షేమం కోసం, చిన్న పరిశ్రమల మనుగడ కోసం మొత్తం మీద పరిస్థితిని గాడిలో పెట్టడానికి ఉద్దేశించిన నిధులు దారి మళ్ళాయని ఫైనాన్సియల్ ట్రాన్సపరెన్సీ కోయలేషన్ (ఎఫ్ టి సి)  తన నివేదికలో వెల్లడించింది. కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఆర్హికపరంగా భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంత మాత్రం అవసరానికి సరిపడా రీతిలో లేవని ఈ సంస్థ తెలిపింది. అక్రమ ఆర్ధిక నిధుల మల్లింపును అరికట్టి ఇటు ప్రజల్లోనూ అటు సమాజంలోనూ చైతన్యాన్ని కలిగించేందుకు కృషిచేస్తున్న ఎఫ్ టి సి సంస్థ మొత్తం తొమ్మిది దేశాలకు సంబంధించి ఈ కోవిడ్  రికవరీ నిధులపై దృష్టి పెట్టింది. ఎక్కడా కూడా ఈ నిధులు ఉద్దేశిత వర్గాలకు చేరిన దాఖలాలు లేవని తేల్చి చెప్పింది.   

ఈ అక్రమ ఆర్ధిక నిధుల మల్లింపు వల్ల వర్ధమాన దేశాలు ఒక ట్రిలియన్ డాలర్ల మేర మూల్యం చెల్లించుకుంటున్నాయని స్ఫష్టం చేసింది. ఇలా కోవిడ్ రికవరీ నిధులు పెద్ద కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లడం వల్ల అంతిమంగా నష్టపోయేది ఇటు ప్రజలు, అటు పౌర సమాజమేనని ఈ సంస్థ తెలిపింది. వివిధ దేశాల్లో ఖర్చుపెడుతున్న కోవిడ్ రికవరీ నిధులకు సంబంధించి  లోతైన వివరాలు అందించింది. అనేక దేశాలు కార్పొరేట్ సంస్థల ఉద్దీపన కోసం భారీగానే నిధులను కేటాయిస్తున్నాయని, అనేక రకాలుగా వాటిని ఆదుకుంటున్నాయి. ఈ సంక్షేమ అవసరాలను విస్మరించడం వల్ల కోవిడ్ పరిస్థితులు మరింత తీవ్రమై ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 150 మిలియన్ల మంది ప్రజలు అత్యంత తీవ్రమైన పేదరిక కూపంలో చిక్కుకునే ప్రమాదం ఉందని వెల్లడించింది.   

అనేక దేశాల్లో ఈ బెయిల్ అవుట్ నిధులు కార్పొరేట్ సంస్థలకు అందుతున్నాయే తప్ప కార్మికులు, పేదలు, చిన్న వ్యాపార సంస్థలకు ఏ మాత్రం చేరడం లేదని ఎఫ్ టి సి తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధనికులు, పేదల మద్య వ్యత్యాసం మరింత పెరగడంతో పాటు ఆయా దేశాల రుణభారం కూడా పెరిగి పోతుందని ఆరోగ్య పరిరక్షణ, సామాజిక రక్షణ వ్యవస్థలు కుప్పకూలిపోతాయని ఎఫ్ టి సి డైరెక్టర్ మాటి హొహొనెన్ హెచ్చరించారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలు మిశ్రమంగానే ఉన్నాయని,  విత్తపరమైన ప్రతిస్పందన పేలవంగా ఉందని ఎఫ్ టి సి స్పష్టం చేసింది.  

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   an hour ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   9 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle