newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహారాష్ట్ర హోంమంతిపై సీబీఐ విచారణ.. అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా!

05-04-202105-04-2021 21:33:37 IST
2021-04-05T16:03:37.426Z05-04-2021 2021-04-05T16:03:31.874Z - - 16-04-2021

మహారాష్ట్ర హోంమంతిపై సీబీఐ విచారణ.. అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రతి నెలా వందకోట్ల రూపాయలను వసూలు చేసి తనకివ్వాలంటూ పోలీసు శాఖను డిమాండ్ చేసి తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. చేశారు అనడం కంటే రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే బాగుంటుంది. కారణం మహారాష్ట్ర హోంమంత్రి వ్యవహారంపై విచారణ జరపాల్సిందేనని బాంబే హైకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించిన నేపథ్యంలో తప్పనిసరై అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.

వందకోట్ల వసూళ్ల కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మొండికేసిన హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చివరివరకు పోరాడారు. కానీ మహారాష్ట్ర మాజీ పోలీసు చీఫ్ పరమ్ వీర్ సింగ్ స్వయంగా దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే‌కే ఉత్తరం రాసిన నేపథ్యంలో విషయం హైకోర్టు వరకు వెళ్లింది. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందేనని సోమవారం బాంబై హైకోర్టు స్పష్టం చేయడంతో హోమంత్రి తప్పనిసరై రాజీనామా చేయాల్సి వచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్‌ థాకరేకు పంపించారు.

అయితే హోంమంత్రి రాజీనామాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇంకా ఆమోదించలేదు. హైకోర్టు ఆదేశం నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా తమ పార్టీకి చెందిన హోమంత్రి రాజీనామాకు అంగీకారం తెలిపినట్లుంది. దీంతో పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు కీలక మలుపు తిరిగింది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ముంబై ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు సచిన్ వాజేని పేలుడు పదార్థాల కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా కుదిపేసిన పరిణామాలు చకచకా జరిగిపోయాయి.

పేలుడు పదార్థాల కేసులో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజేను మంత్రి అన్నిరకాలుగా పరంబీర్ సింగ్ ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పురమాయించారంటూ పరంబీర్‌ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. హోం మంత్రి అనిల్‌ దేశ్ ముఖ్ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్‌ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారని, నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ పదేపదే మంత్రి అనిల్‌ కోరినట్లు తెలిపారు. రూ.100 కోట్ల ఫండ్‌ కలెక్ట్‌ ఎలా చేయాలో కూడా సచిన్‌ వాజేకు చెప్పినట్లు పరమ్‌బీర్‌ సింగ్‌ లేఖలో తెలిపారు.

సాకులు చెప్పడానికి ఏ మార్గాలూ కనిపించని పరిస్థితుల్లోనే తన రాజీనామా లేఖను ఆమోదించవలసిందిగా హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ముఖ్యమంత్రిని కోరారు. కోర్టు ఆదేశం తర్వాత పదవిలో కొనసాగడానికి ఎలాంటి నైతిక హక్కూ తనకు లేదని, అందుకే పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను దయచేసి అంగీకరించవలసిందని అనిల్ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో సీనియర్ నేత అయిన అనిల్ దేశ్ ముఖ్ శివసేన కూటమి ప్రభుత్వంలో హోంమంత్రిగా చేరారు. శరద్ పవార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే అనిల్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

అయితే మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్ దేశ్ ముఖ్ సైతం సీబీఐ విచారణను రద్దుచేయవలసిందిగా సుప్రీంకోర్టును అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ పార్టీకి చెందిన హోంమంత్రికి క్లీన్ చిట్ ఇవ్వడంతో దేశ్ ముఖ్ తన రాజీనామా డిమాండ్లను తోసిపుచ్చి పదవిలో కొనసాగుతూ వచ్చారు.

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   10 hours ago


కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   14 hours ago


రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   16 hours ago


సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   a day ago


మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   15-04-2021


ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   19 hours ago


దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021


ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021


ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle