newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

లాక్ డౌన్ అంతిమ ఆయుధమే.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

21-04-202121-04-2021 10:03:30 IST
2021-04-21T04:33:30.405Z21-04-2021 2021-04-21T04:33:24.003Z - - 25-07-2021

లాక్ డౌన్ అంతిమ ఆయుధమే.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ధీమానందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. లాక్డౌన్వి ధించడం అన్నది చిట్ట చివరి ప్రయత్నమే కావాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. వరుసగా ఆరో రోజు కూడా రెండు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదై న తరుణంలో ప్రధాని చేసిన ఈ విజ్ఞప్తికి ప్రాధాన్యత చేకూరింది. పలు రాష్ట్రాలు కార్ఫ్వు లేదా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మాట్లాడిన మోదీ “ లాక్ డౌన్ విధించడం చివరి ఆయుధమే కావాలని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఇతరత్రా అన్ని ప్రయత్నాలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ను నివారించడానికే ప్రయత్నించాలని రాష్ట్రాలకు ప్రధాని స్పష్టం చేశారు.

సూక్ష్మ స్థాయిలో కంటాయిన్మెంట్ జోన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని అన్నారు. అలాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రజలు పెద్దమనసుతో ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ దిశగా కృషిచేస్తున్న ఎన్జీఓ సంస్థలను ప్రధాని అభినందించారు. కోవిడ్ రెండవ దశ వ్యాప్తిని పెను తుఫానుగా మోదీ అభివర్ణించారు. ఈ పరిస్థితిలో ప్రజలు ఎదుర్కుంటున్న కష్టాలు, నష్టాలు తమకు తెలుసునని మోదీ అన్నారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే మరణించిన వారి కుటుంబాలకు యావత్ జాతి తరపున నివాళులు అర్పించారు. కరోనా మహమ్మరిని ఓ పెద్ద సవాలుగా పేర్కొన్న ప్రధాని అంకిత భావం, ధైర్యం, సన్నద్ధతతోనే ఈ వైరస్ను ఎదురుకోవాలని పిలుపునిచ్చారు.

సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నా సహనాన్ని కోల్పోకూడదని హితవుపలికారు. గతకొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిస్థితిలో మెరుగుదలను తీసుకువస్తాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దేశంలో ఆక్సిజన్ సరఫరా అంశాన్ని ప్రస్తావించిన మోదీ అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి  ఆక్సిజన్ అందించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటుసంస్థలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత చవకగా కోవిడ్ వ్యాక్సిన్ ఆరంభాలతోనే లభిస్తోందని మోదీ చెప్పారు.

మే 1నుంచి 18 ఏళ్ళు దాటిన ప్రతీ ఒక్కరికి ఈ వాక్సిన్ అందిస్తామని, దీని వల్ల పట్టణ ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు వాక్సిన్పరిధిలోకి వస్తారని చెప్పారు. కంటైన్మెంట్జోన్లు, కర్ఫ్యూలు, లోక్డౌన్లు విధించాల్సిన అవసరం రాకుండా ప్రతి ఒక్కరు ప్రభుత్వాలకు సహకరించాలని పిలుపునిచ్చారు.

తీవ్రత తగ్గని కరోనా.. కర్ఫ్యూ, లాక్ డౌన్ దిశగా రాష్టాల అడుగులు

మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   2 hours ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   9 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle