newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తుందా?.. పబ్లిక్ టాక్ అదే

23-04-202123-04-2021 18:50:51 IST
Updated On 24-04-2021 08:56:37 ISTUpdated On 24-04-20212021-04-23T13:20:51.735Z23-04-2021 2021-04-23T13:20:48.745Z - 2021-04-24T03:26:37.025Z - 24-04-2021

కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తుందా?.. పబ్లిక్ టాక్ అదే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి అంచనా వేయడం ఆరోగ్యశాఖకు తలకు మించిన భారంగా మారింది. చివరి ఆరు నెలలో దేశంలో కరోనా కేసులు సంఖ్య ఘననీయంగా తగ్గిపోవడంతో ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. నెమ్మదిగా కరోనా ఆంక్షలు, లాక్ డౌన్ ఎత్తివేశారు కానీ జనం కరోనా ఇంకా ఉంది అనే మాట మర్చిపోయి ఎవరి పనులలో వారు నిమగ్నం అయిపోయారు. మాస్కులు, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్ అనే పదాలే మర్చిపోయారు.

జనానికి తోడు ప్రభుత్వాలు కూడా రెస్టారెంట్, పబ్బులు, సినిమా థియేటర్లకు తెరుచుకోమని నిబంధనలతో కూడిన అనుమతులని ఇచ్చింది. మొదట్లో కాస్త నిబంధనలు బాగానే ఫాలో అయినా పోను పోను నిబంధనలను వాళ్లకు వాళ్లే సడలించుకున్నారు. అది గమనించిన అధికారులు, ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు, నిమ్మకు నీరెత్తనట్టు ప్రవర్తించాయి. 

సెకండ్ వేవ్ ఉదృతికి కారణాలు ఇవే.. 

1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్స్ కోసం పబ్లిక్ మీటింగులు 

2) వ్యాక్సిన్ అందరికీ పూర్తిగా వినియోగంలో లేక పోవడం 

3) సినిమా వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లు 

4) ముఖ్యంగా ప్రజల భాధ్యతా రాహిత్యం   

ఆరోగ్యశాఖ లెక్కలో ఇప్పటివరకు ఇండియాలో వచ్చిన కరోనా కేసులు కోటి అరవై లక్షల ముప్పై వేలు(16.3M), మరణాలు లక్షా ఎనబై ఏడు వేలు (187K). ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. ఇండియాలో ఆసుపత్రులు, తాగునీరు, వెళ్ళడానికి రోడ్లు, కరెంటు వంటి కనీస సదుపాయాలు లేని ఊరులు, పల్లెలు ఎన్ని ఉన్నాయో మనం గుర్తు చేసుకోవలసిన అవసరం లేదనుకుంట. అలాగే నమోదుకానీ, రెకార్డుల్లోకెక్కని కేసులు ఎన్ని ఉంటాయో కూడా ప్రభుత్వాలతో పాటు మనకి కూడా తెలుసు.  

రోజులు కరోనా కేసులు లక్షల్లో వస్తున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుపుచేయడం కష్టం అది వాళ్లకు కూడా తెలుసు, వాక్సిన్ లు సరిపడా లేవు. ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం లాక్ డౌన్ మాత్రమే అని ప్రజలు పబ్లిక్ గా మాట్లాడుకుంటున్నారు. ఇవి పబ్లిక్ నుంచి వచ్చిన మాటలే సుమీ. 

చివరగా మనం భాధ్యతగా మాస్కులు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్, బయటికి వెళ్లి వచ్చిన తరువాత కాళ్లు, చేతులు, ముఖం శుభ్రం చేసుకోవడం వంటి కనీస పద్దతులను పాటించి సమాజానికి మన వంతు సహాయం చేద్దాం.

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle