newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ప్రధాని మెచ్చుకున్న ఆమెను పక్కన పెట్టేసిన పినరయి

19-05-202119-05-2021 10:13:32 IST
2021-05-19T04:43:32.028Z19-05-2021 2021-05-19T03:10:34.020Z - - 14-06-2021

ప్రధాని మెచ్చుకున్న ఆమెను పక్కన పెట్టేసిన పినరయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కెకె శైల‌జ‌.. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా వినిపించిన పేరు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆమెను మెచ్చుకున్నారు. కరోనా కట్టడికి ఆమె తీసుకున్న నిర్ణయాలను ఎన్నో రాష్ట్రాలు పాటించాయి. అలాంటిది ఇప్పుడు ఆమెకు కేబినెట్ లో చోటు లేకుండా పోయింది. కేరళ కొత్త ప్రభుత్వం కెకె శైలజను పక్కన పెట్టడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. 

క‌రోనా వైర‌స్ దేశంలోకి ప్రవేశించిన మొద‌ట్లో కెకె శైల‌జ‌ అద్భుతంగా ప‌నిచేశారు. కేర‌ళలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌ను, అంటువ్యాధుల‌తో పాటు క‌రోనా కేసుల‌ను కట్టడి చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా కెకె శైల‌జ‌కు మంచి పేరు దక్కింది. అయితే రెండోసారి వ‌రుస‌గా కేర‌ళ‌లో అధికారంలోకి వ‌చ్చిన లెఫ్ట్ కూట‌మి ప్ర‌భుత్వంలో శైల‌జ‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. 

మే 20న కేరళలో కొలువుదీరనున్న కొత్త కేబినెట్‌లో శైలజకు చోటు ద‌క్క‌లేద‌ని స‌మాచారం. ఆమెకు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌కుండా పార్టీ విప్‌గా నియ‌మించనున్నారు. గ‌త క్యాబినెట్ లో మంత్రులుగా ప‌నిచేసిన వారికి ప‌ద‌వులు ఇవ్వొద్ద‌న్న సీపీఎం నిర్ణ‌యంతో ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. మే 20వ తేదీన కొత్త మంత్రివ‌ర్గం కొలువుదీరనున్నట్లు ఎల్డీఎఫ్ ప్ర‌క‌టించింది. వ‌రుసగా రెండోసారి సీఎంగా ఈనెల 20న పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నుండ‌గా… 11మంది కొత్త వారికి మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించారు. 

సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రకటించిన వివరాల ప్రకారం పినరయి విజయన్ తదుపరి మంత్రివర్గంలో ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పీ రాజీవ్, వీఎన్ వాసవన్, సజి చెరియన్, వీ శివన్ కుట్టి, మహమ్మద్ రియాస్, డాక్టర్ ఆర్ బిందు, వీణా జార్జి, వీ అబ్దుల్ రహమాన్ మంత్రి పదవులను చేపట్టబోతున్నారు. నూతన మంత్రివర్గంలో పెను మార్పులు రాబోతున్నట్లు సీపీఎం ముందుగానే సంకేతాలు ఇచ్చింది. నవ తరానికి పెద్ద పీట వేయనున్నట్లు తెలిపింది. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, మాజీ పరిశ్రమల మంత్రి ఈపీ జయరాజన్, మాజీ పీడబ్ల్యూడీ మంత్రి జీ సుధాకరన్ వంటివారిని ఎన్నికల బరి నుంచి తప్పించారు. 62 మంది సభ్యులుగల పార్లమెంటరీ పార్టీలో కొత్త నేతలు అధికంగా ఉన్నారు. 

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

   11 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   an hour ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle