newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

కిరణ్ బేడీని తప్పించేశారుగా.. ఏమన్నారంటే..!

17-02-202117-02-2021 13:33:11 IST
Updated On 17-02-2021 14:04:57 ISTUpdated On 17-02-20212021-02-17T08:03:11.665Z17-02-2021 2021-02-17T08:03:04.372Z - 2021-02-17T08:34:57.936Z - 17-02-2021

కిరణ్ బేడీని తప్పించేశారుగా.. ఏమన్నారంటే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీని ఆ పదవి నుంచి తప్పిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి మంగళవారం నాడు  అధికారిక ప్రకటన విడుదలైంది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొత్త గవర్నర్ నియామకం వరకు తమిళిసై అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలో పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనుండడంతో ఈ మార్పు వెనక రాజకీయ పరమైన కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. 

తనను పుదుచ్చేరి గవర్నర్ గా తొలగించినట్టు ఉత్తర్వులు వెలువడిన తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తొలిసారిగా స్పందించారు. "పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా సాగిన నా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రజలకు, అధికారులకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేసిన ఆమె.. ఓ లేఖను విడుదల చేశారు. తనను లెఫ్టినెంట్ గవర్నర్ గా పంపిన కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు జీవితంలో మరపురాని అనుభూతని.. తనతో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని, తన పదవీ కాలంలో ప్రజల సంక్షేమం కోసమే కృషి చేశానని అన్నారు. రాజ్యాంగ పరమైన తన బాధ్యతలను నిర్వర్తించానని, నీతి నిజాయతీలకు కట్టుబడ్డానని పేర్కొన్న ఆమె, పుదుచ్చేరికి మంచి భవిష్యత్తు ఉండాలని, అది ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు.

పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం నెలకొనడం, దాని వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే కారణమని విమర్శలు రావడంతో కిరణ్ బేడీని ఎల్జీగా తొలగిస్తూ, రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులను జారీచేసింది. ఈ సంవత్సరం మేలో  పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది.  ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాజీనామాలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితమే యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీకి,  ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ఆయన ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే మంగళవారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుద్దుచ్చేరి రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి నారాయణస్వామి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కెబినేట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలు, సీనియర్లతో విడివిడిగా సమావేశం అయ్యారు.   


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle