newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

28-10-202028-10-2020 08:05:41 IST
Updated On 29-10-2020 06:52:11 ISTUpdated On 29-10-20202020-10-28T02:35:41.487Z28-10-2020 2020-10-28T02:35:32.779Z - 2020-10-29T01:22:11.682Z - 29-10-2020

హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అబ్బ‌. ఎంత బావుంది. జీవితాంతం ఇక్క‌డే ఉండాల‌నుంది. ఓ ఫ్లాట్ కొనుక్కుని.. చిన్న ఇల్లు క‌ట్టుకుని.. ఈ కొండ‌ల్లో కోన‌ల్లో బ‌తికితే ఎంత బావుంటుందో క‌దా. శేష జీవితం ఇక్క‌డ గ‌డిపితే భ‌లే ఉంట‌ద‌బ్బా.. ఓ రెండెక‌రాల పొలం కొనుక్కుని.. పూల తోట‌లు వేసుకుని చూస్తూ బ‌తికేయొచ్చు. యాపిల్ తోట‌లు వేసుకుని.. తింటూ బ‌తికేయొచ్చు.. కానీ ఏం చేస్తాం.. సెంటు భూమి కూడా కొన‌డం వీలు కాదే. ఈ రూల్స్  అట్టా త‌గ‌ల‌డ్డ‌య్. చేసేదేముంది. ఏటా ఇలా వ‌చ్చి.. చుట్టం చూపుగా చూసి పోవ‌డ‌మే.. అని.. చాలా మంది ఓ ఇదై పోతుంటారు క‌దా. నిజ‌మేలే డ‌బ్బు ఫుల్ గా ఉండి.. ఈ ఏరియాలో ఉండాలి అనుకునే వాళ్లు ఎంతో మంది. పొలం కొనాల‌ని.. ప్లాట్ కొనుక్కుని ఇల్లు క‌ట్టుకుని ఇక్క‌డ సెటిల్ అవ్వాల‌ని చాలా మంది అనుకుంటారు కానీ.. ఇన్నాళ్లూ కుద‌ర్లేదు. చుట్టాలుగా ఓకే అన్న చ‌ట్టాలు.. సెటిల్ అవుతామంటే ఒప్పుకోలేదు. ఇక పై అక్క‌డ కూడా ల్యాండ్ కొనొచ్చు.. ఇల్లు క‌ట్టుకోవ‌చ్చు.. పొలం కొనుక్కోవ‌చ్చు.. పంట‌లేసుకోవ‌చ్చు. అన్నీటికీ లైన్ క్లియ‌ర్ చేసింది సెంట్ర‌ల్ స‌ర్కార్. ఇమీడియ‌ట్ గా అమ‌ల్లోకి తెచ్చింది కూడా.. ఇప్పుడు నిర్ణ‌యం తీసుకున్నారంటే అది ఎప్పుడు అమ‌ల్లోకి వ‌స్తుందో అనే ఫీలింగేం వ‌ద్దు.. జ‌స్ట్ అక్క‌డ ల్యాండ్ ఎక్క‌డ కావాలో గూగుల్ లో స‌ర్చుకుని రైలో, ప్లేనో ఎక్కండి. అంతే.

క‌శ్మీర్ కూడా భార‌త్ భూభాగంలో అంత‌ర్భాగ‌మే అని నిరూపించే ప్ర‌క్రియ‌లో ఇంకో నిర్ణ‌యం తీసుకుంది సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్. ఇన్నాళ్లూ అక్క‌డ క‌శ్మీరీల‌కు మాత్ర‌మే ల్యాండ్ కొనే అవ‌కాశం ఉంది. శాశ్వ‌త పౌరుల‌కు మాత్ర‌మే అనే క్లాజ్ ఉంది. ఇప్పుడు దాన్ని ర‌ద్దు చేస్తూ.. శాశ్వ‌త అనే ప‌దం తొల‌గించి.. అంద‌రూ కొనొచ్చు అని క్లియ‌ర్ చేసింది. కాక‌పోతే.. వ్య‌వ‌సాయ భూమిని వ్య‌వ‌సాయేత‌ర అవ‌స‌రాల కోసం కొనడానికి వీళ్లేదు. ఫ్యాక్ట‌రీలు క‌డ‌తాం.. పొల్యూష‌న్ పెంచుతాం అంటే ఊరుకోరు. కాక‌పోతే.. స్కూల్ల కోసం కొనుక్కోవ‌చ్చు.. హాస్పిట‌ల్స్ క‌ట్టాలంటే కూడా వ్య‌వ‌సాయ భూమిని కొనుక్కోవ‌చ్చు. ద‌ట్సాల్.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle