newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులను నెత్తిన పెట్టుకోవద్దు.. రెబిరో

21-03-202121-03-2021 11:06:31 IST
2021-03-21T05:36:31.049Z21-03-2021 2021-03-21T05:36:26.936Z - - 16-04-2021

ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులను నెత్తిన పెట్టుకోవద్దు.. రెబిరో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముంబై నగరంలో మాఫియాలను సంవత్సరాలపాటు వణికించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు సచిన్ వాజే.. బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాస భవంతి సమీపంలో పేలుడు పదార్థాలను నింపిన కారును ఉంచి డబ్బు గుంజడానికి ప్రయత్నించాడని వార్తలు గత వారంరోజులుగా హోరెత్తుతున్న నేపథ్యంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులను నెత్తిన బెట్టుకోవడం ఇకనైనా ఆపివేయాలని ముంబై నగర మాజీ కమిషనర్, భారత మాజీ రాయబారి జూలియో రెబిరో పేర్కొన్నారు. నేటి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులు రేపో మాపో రోగ్ స్పెషలిస్టులుగా మారిపోవడనికి ఎంతో దూరం పట్టదని రెబీరో హెచ్చరించారు.

ఎన్‍కౌంటర్ అనే పదం కానీ, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అనే పదం కానీ మన మధ్యతరగతి జీవుల్లో వివరీతమైన క్రేజీ పదంగా మారిపోయి చాలా కాలమైంది. ఎన్‌కౌంటర్ చేసిపడేస్తా నా కొడకా అని సినిమాల్లో పోలీసు అధికారులు నేరస్తులను, లేక నేరంచేసినట్లు అనుమానిస్తున్న వారిని తిడుతుంటే ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకుంటాయి. నేరవిచారణ, దర్యాప్తు, శిక్ష పడేలా న్యాయప్రక్రియను త్వరితం చేసి నేరస్థులను చట్టపరంగా శిక్షించడానికి బదులుగా నేరస్తులను చట్టవిరుద్ధంగా పోలీసులు కాల్చిచంపడానికి ముద్దుపేరే ఎన్ కౌంటర్.

ఈ పదం ఎంత వాడుకైపోయిందంటే పోలీసులు, సైనికులు చట్టవిరుద్ధంగా కొంతమంది వ్యక్తులను కాల్చి చంపడం, ఆనక ఆత్మరక్షణార్థం కాల్చాల్సి వచ్చిందని చెప్పడానికి మన మధ్యతరగతి జీవులు నైతిక సమర్ధన చేసేస్తున్నారు. ఎంతమంది దొంగలను, కరుడగట్టిన నేరస్తులను కాల్చి చంపితే అంత గొప్ప పోలీసు అన్నమాట.

ఇలా ఒక చట్టవ్యతిరేక హత్యను గ్లోరిఫై చేయడం ద్వారా పోలీసు స్పెషలిస్టులు ఎలా తయారయ్యారంటే వాళ్లు ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా నగర మధ్యతరగతి ఎన్ కౌంటర్ స్పెషలిస్టులను ఆరాధిస్తోంది. తీవ్ర నేరస్తులను కాల్చి చంపడం ద్వారా సమాజంలోని ఒక పెద్ద సమూహం నైతిక సమర్థన పొందుతున్న పోలీసు వీరులు ఆ క్రమంలోనే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అనేక వక్రమార్గాలు పట్టి  తమకూ, పోలీసు శాఖకు కూడా మరక అంటిస్తున్నారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ రెబీరో తేల్చి చెప్పారు.

చివరకు ఈ పోలీసు స్పెషలిస్టులు బరితెగించిపోయి బిల్డర్ల నుంచి, చిత్రనిర్మాతల నుంచి, లెక్కకు తేలని ధన సంపదల్లో మునిగితేలేవారి నుంచి భారీ స్థాయిలో డబ్బు గుంజుకోవడానికి అడ్డమైన దార్లూ చేపడుతున్నారు. 

చట్టప్రకారం నేరస్తుడికి శిక్ష పడేలా చేయలేకపోతున్న పోలీసులు అడ్డదారిలో నేరస్తుల పని పట్టే క్రమంలో అనేక వక్రమార్గాల్లోకి దిగిపోతున్నారంటూ రెబీరో హచ్చరించారు.

ఇలా పోలీసు అధికారులు ఖాకీ బట్టల్లోని నేరస్తులుగా మారిపోయిన తర్వాత నేరస్తుల కంటే ప్రమాదకరంగా తయారవుతున్నారు. ఖాకీ దుస్తుల మాటున రక్షణ పొందుతున్న పోలీసులు నిర్బయంగా నేరస్తులను కాల్చి చంపడమే కాకుండా ఆక్రమంలో పారిశ్రామికవేత్తలనుంచి డబ్బు గుంజడానికి ఏమాత్రం జంకడంలేదు. ఇలాంటి తరహా ఖాకీలకు రాజకీయంగా దన్ను ఉంటే ఇక చెప్పపనిలేదు. 

నిజానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులను పై అధికారులు అభినందించడం, రాజకీయ నేతలనుంచి రివార్డులు ఇప్పించడంతో ఈ తరహా స్పెషల్ పోలీసులకు ఎక్కడలేని అధికారాలు దక్కేస్తున్నాయి. ఈ చట్టాతీత అధికారాన్ని వేరు మార్గాల్లో ఉపయోగించడం ఏ స్థాయికి పోయిందో చెప్పే అతిపెద్ద ఉదాహరణ సచిన్ వాజే..

ఇప్పుడు దొరికిపోయాక తనను డిపార్ట్‌మెంట్, రాజకీయ నాయకులు కలిసి ఇరికించేశారని చెబుతున్న సచిన్ వాదే గతంలో శివసేన పార్టీతో అంటకాగాడు. తీరా ఎఐఏ విచారణలో ఒక్కొక్కటిగా బయట పడుతున్న వాస్తవాలు సమాజానికి షాక్ తెప్పిస్తున్నాయి.

దేశంలోని, ఆసియా ఖండంలోని అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుటుంబాన్నే టార్గెట్ చేసి ఆయన కుటుంబం మొత్తం పని పడతామని హెచ్చరిస్తూ రాసిన లేఖ సంచలనం కలిగిస్తోంది. చివరకు ఈ చర్యకు పరోక్ష పాత్ర ఉందని చెబుతున్న ముంబై నగర పోలీసు కమిషనర్‌ని కూడా బదలీ చేసికూర్చోపెట్టారంటే ఈ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు కుంభకోణం ఎక్కడిదాకా వెళుతుందో అంచనా వేయవచ్చు.   అందుకే నిజాయితీ ఉన్న అధికారులను కూడా రోగ్స్‌గా మార్చిపడేస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అనే గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ పోలీసు కమిషనర్ రెబీరో స్పష్టం చేశారు.

 

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   10 hours ago


కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   14 hours ago


రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   16 hours ago


సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   a day ago


మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   15-04-2021


ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   19 hours ago


దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021


ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021


ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle