newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్

26-02-202126-02-2021 13:58:15 IST
2021-02-26T08:28:15.838Z26-02-2021 2021-02-26T08:28:12.992Z - - 16-04-2021

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో విసిగి వేసారిపోయిన లక్షలాది ప్రవాస భారతీయులకు ప్రత్యేకించి గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు మండువేసవిలో మలయమారుతంలాంటి చల్లటి వార్తను నూతన అధ్యక్షుడు జో బైడెన్ అందించారు. కరోనా సంక్షోభ సమయంలో విదేశీయులు దేశంలోకి అడుగుపెట్టకుండా వీసాలపై ట్రంప్‌ హయాంలో విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. 

కరోనా సమయంలో ఏర్పడిన నిరుద్యోగాన్ని గాడిలో పెట్టాలంటే వీసాలపై నిషేధమే సరైనదంటూ అప్పట్లో ట్రంప్‌ నిర్ణయించారు. అయితే బైడెన్‌ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇకపై అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డుల దరఖాస్తుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. 

కరోనా సంక్షోభం దరిమిలా స్థానికుల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే కారణంతో నిరుడు ఏప్రిల్‌లో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు అమెరికాలో ప్రవేశించకుండా ట్రంప్‌ నిషేధం విధించారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఎన్నో పరిశ్రమలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల సేవల్ని వినియోగించు కోకుండా నిరోధిస్తుంది. ఇక అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందిన వారు రానివ్వకుండా చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఉద్యోగుల్ని వారి కుటుంబ సభ్యులు కలవనివ్వకుండా చేస్తోంది. అందుకే వీసాపై నిషేధాన్ని ఎత్తేస్తున్నాను అని బైడెన్‌ చెప్పారు. 

అంతకుమించి వీసాలపై నిషేధం ఉండడం వల్ల ఎందరో ఉద్యోగులు కుటుంబాలకు దూరమై మానసిక వేదన అనుభవిస్తారని, దాని ప్రభావం అమెరికా వాణిజ్యంపైనే పడుతుందని బైడెన్ అన్నారు. బైడెన్‌ నిర్ణయంతో హెచ్‌–1బీ వీసాపైన అమెరికాలో ఉన్న ఎందరో భారతీయ టెక్కీలు ఊపిరి పీల్చుకున్నారు.

గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. డిసెంబరు 31, 2020 వరకు ఉన్న ఆంక్షల గడువును ట్రంప్‌.. ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు అమెరికన్ల ఉపాధిని పరిరక్షించే చర్యగా అప్పట్లో ట్రంప్‌ దీనిని అభివర్ణించారు. తద్వారా గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు.

గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వ‌ర్క‌ర్ల హ‌క్కుల‌ను కాపాడే చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గ్రీన్‌ కార్డుల జారీ వీసాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ట్రంప్‌ అప్పటి ఆంక్షలు సరైనవి కాదంటూ తాజా ప్ర‌క‌ట‌న‌లో బైడెన్ స్ప‌ష్టం చేశారు. ఈ ఆంక్షలు అమెరికాలో కుటుంబాలను తిరిగి కలవనీయకుండా నిరోధించాయని, అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయని బైడెన్‌ పేర్కొన్నారు. 

తాను అధికారంలోకి వస్తే కఠినమైన ఇమిగ్రేషన్‌ విధానాలను సరళీకృతం చేస్తానన్న హామీ లో భాగంగా గ్రీన్‌కార్డులపై ట్రంప్‌ విధించిన ఆంక్షలను బైడెన్‌ తాజాగా ఉపసంహరించారు. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకృతం చేస్తానంటూ డెమొక్రాటిక్ అధ్యక్షుడు బైడెన్ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. వలసేతర వీసా హెచ్‌1బీపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాస హోదా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులకు నిజంగా ఇది ఊరట కలిగించే విషయమే. 

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   9 hours ago


కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   13 hours ago


రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   16 hours ago


సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   a day ago


మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   a day ago


ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   18 hours ago


దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021


ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021


ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle