newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

08-04-202108-04-2021 16:13:03 IST
2021-04-08T10:43:03.267Z08-04-2021 2021-04-08T04:10:34.858Z - - 20-04-2021

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు సెలబ్రటీల నుంచి రాజకీయ నాయకుల నుంచి వైద్య నిపుణుల వరకు.. దేశంలోని ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలు పంపిణీ చేయాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా పదే పదే డిమాండ్ చేస్తున్నారు. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యవసరమైన వారికే తప్ప టీకా కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్దేశించింది కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చిచెప్పింది. అయితే ఈ నిబంధనలూ గట్రా పక్కనబెట్టి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇవ్వనిదే దేశం వైరస్ నుంచి బయటపడినట్లు కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్క పౌరుడు కరోనా నుంచి సురక్షితంగా బయటపడనిదే దేశ పౌరులు సేఫ్‌గా ఉన్నట్లు కాదని వీరంటున్నారు.

ఈ విషయంలో వైద్య నిపుణులు రెండు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందనిదే, దేశం సురక్షితంగా ఉంటున్నట్లు చెప్పలేమని కొందరి భావన. కానీ ఇప్పటికే దేశంలో వాడుతున్న రెండు వ్యాక్సిన్‌లను 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఇస్తున్నారన్నది తెలిసిన విషయమే.

మరికొందరు వైద్య నిపుణులు ప్రాధాన్యతా బృందాలకు మాత్రమే కరోనా టీకా ఇవ్వాలనే కేంద్ర నిర్ణయం సమంజసమే అయినప్పటికీ వైరస్ అతివేగంగా వ్యాప్తి చెందుతున్న పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడం ఉత్తమమని చెబుతున్నారు.

పట్టణాల్లో కనీసం 30 నుంచి 40 వరకు (ఇప్పటికే 45 నుంచి 55 శాతం వైరస్ బారిన పడి ఉండారనే అంచనాతో) ప్రజలకు రోగనిరోధకతను కలిగించినట్లయితే, కరోనా వైరస్ నెమ్మదించే అవకాశముందని భారతీయ అగ్రశ్రేణి వాక్సిన్ నిపుణుడు డాక్టర్ గగన్ దీప్ కాంగ్ చెప్పారు. అయితే దీనికి సంబందించి వ్యాక్సిన్ రక్షణ కలిగించే సమయం, కొత్త రకం వైరస్‌ల రాక వంటి అడ్డంకులు ఉండే అవకాశం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ పెద్ద ఎత్తున ఇవ్వడం ద్వారానే కరోనా వ్యాప్తిని అరికట్టగలం. అంతిమంగా చూస్తే పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వడం ద్వారా సార్వత్రిక నిరోధకతను కల్పించాల్సి ఉందని ఆయన చెప్పారు.

ఇదేవేగంతో కరోనా విజృంభిస్తే 2 రోజుల్లో లక్ష కరోనా కేసులు గ్యారంటీ

మరోవైపు భారతీయ వైద్యశాస్త్రాల అధ్యయన సంస్థ నేరుగా ప్రధాని నరేంద్రమోదీకే ఉత్తరం రాసింది. ప్రస్తుతానికి దేశంలో 45 సంవత్సరాలకు పైబడిన వయసు కలిగిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. కానీ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తమిస్తున్న కారణంగా మన వ్యాక్సినేషన్ వ్యూహాన్ని తక్షణం వేగవంతం చేయాల్సిన అవసరముందని మేం సూచిస్తున్నాం. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా అనుమతించాలని అని ఐఎమ్ఏ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మహారాష్ట్ర, డిల్లీ ముఖ్యమంత్రులు ఉద్దవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్ సైతం కేంద్రానికి ఇదే విధంగా అభ్యర్థించారు. సోమవారం కేజ్రీవాల్ ప్రధానికి ఉత్తరం రాస్తూ, కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను వయసుతో పనిలేకుండా అందరికీ అనుమతించేలా నిబంధనలను సరళీకరించినట్లయితే ఢిల్లీలో నివాసముంటున్న ప్రతి ఒక్కరికీ మూడు నెలల్లోగా టీకా అందివ్వగలమని చెప్పారు.

అయితే కోరుకున్న ప్రతి ఒక్కరికీ కాకుండా అవసరమైన వారికి మాత్రమే టీకాలు అందివ్వడమే వ్యాక్సినేషన్ ఉద్దేశమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తేల్చి చెప్పారు. 

ఢిల్లీలో లాక్ డౌన్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

ఢిల్లీలో లాక్ డౌన్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

   16 hours ago


విమాన సర్విసులను ఆపేసిన హాంకాంగ్

విమాన సర్విసులను ఆపేసిన హాంకాంగ్

   17 hours ago


‘ఇంకా ఎంతో చేయవచ్చు’ కోవిడ్ పై మోడీకి మన్మోహన్ లేఖ

‘ఇంకా ఎంతో చేయవచ్చు’ కోవిడ్ పై మోడీకి మన్మోహన్ లేఖ

   18 hours ago


సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

   20 hours ago


మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ

మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ

   17-04-2021


18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్

18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్

   17-04-2021


నీరవ్ మోడీ అప్పగింతకు లైన్ క్లియర్..  యు.కె హోమ్ మంత్రి

నీరవ్ మోడీ అప్పగింతకు లైన్ క్లియర్.. యు.కె హోమ్ మంత్రి

   17-04-2021


రైలు సర్వీసులు యధాతథo.. రైల్వేబోర్డు చైర్మన్ వెల్లడి

రైలు సర్వీసులు యధాతథo.. రైల్వేబోర్డు చైర్మన్ వెల్లడి

   17-04-2021


భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు

భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు

   16-04-2021


అయోధ్య విరాళాలలో 15వేల చెక్కులు బౌన్స్.. విలువ 22 కోట్లు

అయోధ్య విరాళాలలో 15వేల చెక్కులు బౌన్స్.. విలువ 22 కోట్లు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle