ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఔషధ కర్మాగారం.. మోదీ
01-12-202001-12-2020 12:02:25 IST
2020-12-01T06:32:25.964Z01-12-2020 2020-12-01T06:32:10.785Z - - 28-01-2021

ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఔషధ కర్మాగారంగా అవతరించిందని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 సంవత్సరాన్ని మిగతా ప్రపంచం అంతా బాహ్య అంతరాయాల మయంగా భావిస్తోందని, కానీ ఇండియాకు మాత్రం ఇది అంతర్గత ఆవిష్కరణల సంవత్సరం అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మనోరమ ఇయర్‌బుక్–2021లో ‘అత్మనిర్భర్ భారత్–ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’ శీర్షికతో ప్రధాని ప్రత్యేక వ్యాసం రాశారు. కరోనా విపత్కర సమయంలో దేశ ప్రజలంతా ప్రదర్శించిన నిబ్బరం, తెగువ, క్రమశిక్షణ, బాధ్యత, సహనాన్ని చూసి ప్రపంచం ఎంతో అబ్బురపడిందన్నారు. టీకా అభివృద్ధి కోసం భారత్ కంపెనీలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయని ప్రశంసించారు. కరోనా వైరస్ టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మూడు బృందాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. టీకా సామర్థ్యం సహా అన్ని అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించాలని వారిని కోరారు. టీకా నియంత్రణ విధానాలపై సూచనలివ్వాలని కూడా వారిని కోరారు. పుణెలోని జెనోవా బయోఫార్మాçస్యూటికల్స్, హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఈ లిమిటెడ్, హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్‌కు చెందిన శాస్త్రవేత్తలు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీకా రూపకల్పనలో శాస్త్రవేత్తల కృషిని ప్రధాని ప్రశంసించారు. టీకా ప్రయోగ ఫలితాలు ప్రజలందరికీ ఉపయోగపడేలా టీకా ఉత్పత్తిదారులతో సమన్వయంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా అన్ని సంబంధిత విభాగాలకు ప్రధాని సూచించారు. టీకా ప్రయోగ పురోగతి, టీకా ప్యాకేజ్, రవాణా, నిల్వ, కోల్డ్ స్టోరేజ్‌లు సహా మౌలిక వసతుల ఏర్పాట్లు, మానవ వనరుల అవసరం, వినియోగంపై జాగ్రత్తలు.. తదితర అంశాలపై ప్రధాని మోదీ వారితో చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. వివిధ టీకాల రూపకల్పన వివిధ దశల్లో ఉందని, వాటి ప్రయోగాల పూర్తి సమాచారం, ఫలితాలు వచ్చే సంవత్సరం మొదట్లో వెల్లడయ్యే అవకాశం ఉందని పీఎంఓ పేర్కొంది. అమెరికాలోని హెచ్‌డీటీ బయోటెక్ కార్పొరేషన్‌తో జెనోవా బయోఫార్మాçస్యూటికల్స్, అమెరికాకే చెందిన డైనావాక్స్ టెక్నాలజీస్, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో బయోలాజికల్ ఈ లిమిటెడ్, రష్యాకు చెందిన గామాలెయ ఇన్స్టిట్యూట్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ కరోనా టీకా రూపకల్పన, ఉత్పత్తి అంశాల్లో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితి, టీకా పురోగతి.. తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 4వ తేదీన అఖిలపక్ష భేటీని నిర్వహిస్తోంది. పార్లమెంటు ఉభయసభల్లోని పార్టీల ముఖ్య ప్రతినిధులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఈ భేటీని ఏర్పాటు చేస్తోందని, ఇప్పటికే ఆహ్వానం పంపించిందని వెల్లడించాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన లోక్‌సభ, రాజ్యసభల అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుందని పేర్కొన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ భేటీలో పాల్గొంటారని తెలిపాయి.

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్
an hour ago

పెట్రోల్ రేట్.. కనీవినీ ఎరుగని అద్భుతం
3 hours ago

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు
3 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా
4 hours ago

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'కు మూడోస్థానం
5 hours ago

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత
6 hours ago

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం
7 hours ago

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!
19 hours ago

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా
a day ago

భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు
27-01-2021
ఇంకా