newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా టీకా పంపిణీలోనే కాదు.. చాలా అంశాల్లో భారత్ గ్లోబల్ లీడర్.. జాన్ కెర్రీ ప్రశంస

07-04-202107-04-2021 14:31:24 IST
2021-04-07T09:01:24.817Z07-04-2021 2021-04-07T09:01:14.500Z - - 11-04-2021

కరోనా టీకా పంపిణీలోనే కాదు.. చాలా అంశాల్లో భారత్ గ్లోబల్ లీడర్.. జాన్ కెర్రీ ప్రశంస
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యావత్ ప్రపంచానికీ కోవిడ్-19 వ్యాక్సిన్ అందించడంలో భారత నాయకత్వం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని వాతావరణ మార్పుపై అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీ శ్లాఘించారు. వ్యాక్సిన్‌తోపాటు వాతావరణ మార్పు విషయంలో కూడా భారత్ గణనీయంగా తన పాత్రను నిర్వహిస్తోందని కితాబిచ్చారు.

నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీ విచ్చేసిన జాన్ కెర్రీ కీలకమైన భారతీయ మంత్రులు, అధికారులతో భేటీ అవుతున్నారు. ఢిల్లీలో సౌత్ ఆసియన్ ఇన్ ఎనర్జీ లీడర్‌షిప్ సదస్సును ఉద్దేశించి జాన్ కెర్రీ ప్రసంగించారు. 

కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీతో సహా అనేక కీలకమైన అంశాల్లో భారత్ ప్రపంచానికే నాయకత్వం వహించే స్థితిలో ఉంది. ప్రత్యేకించి వాతావరణ మార్పుపై భారత్ చేస్తున్న కృషికి నేను మరింత కృతజ్ఞత చెబుతున్నాను. పునరుపయోగ ఇంధనాల తయారీ విషయంలో భారత్ ఇప్పటికే ప్రపంచ నాయకుడిగా ఉంటోందన్నది నిర్వివాదం అని కెర్రీ స్పష్టం చేశారు.

భారత్ నిజమైన స్నేహితుడిగా, భాగస్వామిగా అమెరికా ఆదేశానికి అన్నివిధాలుగా చేదోడువాదోడుగా ఉంటోందని జాన్ కెర్రీ గుర్తు చేశారు. అమెరికా తన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకునే సమయంలో ఇలాంటి అవకాశం తమకు లభించలేదని, భారత్ మాత్రం ఇప్పుడు చాలా ప్రయోజనం పొందుతోందని కెర్రీ చెప్పారు.

దశాబ్దాలుగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రయోజనం పొందుతూ రావడం మాత్రమే కాదు. అమెరికా మీకు నిజమైన మిత్రుడిగా, భాగస్వామిగా ఉంటూ వస్తోంది. స్వావలంబనతో కూడిన భవిష్యత్తు పంధాలో మీరు సాగిస్తున్న ఈ ప్రయాణంలో అమెరికా మీకు మద్దతునిస్తుందని కెర్రీ చెప్పారు.

దారిద్యా నిర్మూలనలో కూడా భారత్ గణనీయమైన పరివర్తను సాధించిందంటూ జాన్ కెర్రీ కితాబిస్తూనే వాతావరణ మార్పుపై కూడా భారత్ కీలకపాత్ర పోషించాల్సి ఉందని పిలుపునిచ్చారు.

తాజా బడ్జెట్లో భారత్ జాతీయ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్‌ని ప్రకటించిందని, 2030 నాటికి 450 గిగావాట్ల పునరుపయోగ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి నిబద్ధత ప్రకటించిందని జాన్ కెర్రీ ప్రశంసించారు. భారత్ మరింత దూకుడుగా క్లీన్ ఎనర్జీ పరివర్తనను చేపట్టనట్లయితే మరో అయిదు లక్షల ఉద్యోగాలను అదనంగా సృష్టించగలుగుతుందని అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ కూడా అంచనా వేసిందని జాన్ కెర్రీ చెప్పారు.

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   9 hours ago

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   13 hours ago

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   19 hours ago

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   20 hours ago

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle