newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

ఆహారం మీదే భారతీయుల ఖర్చు.. అభివృద్ది ఎలా..?

01-12-202001-12-2020 15:12:06 IST
2020-12-01T09:42:06.033Z01-12-2020 2020-12-01T09:42:02.295Z - - 28-01-2021

ఆహారం మీదే భారతీయుల ఖర్చు.. అభివృద్ది ఎలా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో 2020 పొడవునా ఆహారం, ఆల్కహాల్‌యేతర పానీయాలపై ఖర్చు చేయడానికి కోట్లాది కుటుంబాలు తమ బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యమిచ్చాయని, కరోనా కష్టాలు కొనసాగితే వృద్దిరేటు పెరుగుదలలో జాప్యం జరుగుతుందని  క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఢంకా బజాయించాయి. రాబోయే రోజుల్లోనూ వీటిపై ఖర్చు చేయడం సానుకూలంగానే ఉండనున్నప్పటికీ 2020తో పోలిస్తే స్వల్పంగా తగ్గొచ్చు అని ఫిచ్‌ ఫిచ్‌ సొల్యూషన్స్‌ ఒక ప్రకటనలో వివరించింది.

ప్రజల వినియోదదారీ అవసరాలు ఆహారోత్పత్తుల కొనుగోలును దాటి ముందుకు వెళ్లని కారణంగానే భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవ వత్సరం (2020 ఏప్రిల్‌–2021 మార్చి) తమ క్షీణ అంచనాను 9 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తిపై ఇవి ప్రభావం చూపడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సూచించింది. మహమ్మారి కేసులు తగ్గుతున్నాయా లేదా పెరుగుతున్నా యా అన్న అంశంపై భవిష్యత్‌ ఎకానమీ పనితీరు ఆధారపడి ఉంటుందని విశ్లేషించింది. 

వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్‌ 10 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై మా అంచనాలను మార్చుకునే ముందు కరోనా కేసుల సంఖ్యలో స్థిరత్వం లేక తగ్గుదల వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే మూడవ త్రైమాసికానికి (అక్టోబర్‌–డిసెంబర్‌) సంబంధించిన కీలక ఆర్థిక గణాలను పరిగణనలోకి తీసుకోవాలి అని ఎస్అండ్‌పీ స్పష్టం చేసింది.

మరోవైపున కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు విస్తృత ప్రాతిపదికన ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రకటించిన చర్యలు దిగువ ఆదాయ కుటుంబాలను ఉద్దేశించి తీసుకున్నవి. మరోవైపు ద్రవ్యోల్బణం తీవ్రత ఆర్‌బీఐ రేట్ల కోత అవకాశాలను కట్టడి చేస్తున్నాయి. అయితే ఆలస్యంగా అయినా ప్రజలు వివిధ అవసరాలపై ఖర్చు చేయడం మళ్లీ మొదలవుతుందని పిచ్ సొల్యూషన్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. 

కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బతో భారత్‌లో ఈ ఏడాది వ్యయాలు తగ్గించుకున్న వినియోగదారులు వచ్చే ఏడాది మళ్లీ ఖర్చు చేయడంపై దృష్టి పెట్టనున్నారని, దీంతో 2021లో వినియోగదారుల వ్యయం 6.6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ ఒక నివేదికలో పేర్కొంది.

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

   an hour ago


పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

   2 hours ago


నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

   3 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

   4 hours ago


ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

   4 hours ago


ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

   6 hours ago


అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

   7 hours ago


ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

   18 hours ago


డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

   a day ago


భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

   27-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle