newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!

29-09-202029-09-2020 09:48:44 IST
2020-09-29T04:18:44.721Z29-09-2020 2020-09-29T04:18:41.230Z - - 20-10-2020

రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

లాక్ డౌన్ కారణంగా రైలు ప్రయాణాలు చేయడం లేదు జనాలు..! త్వరలోనే రైళ్ల సంఖ్యను మరింత పెంచనుంది భారతీయ రైల్వే. అయితే ప్రయాణీకులకు మాత్రం రైలు ప్రయాణం భారం కానుంది. ఒక్కో టికెట్‌పై యూజర్‌ ఫీ రూపంలో రూ. 10 నుంచి రూ. 35 వరకు అదనంగా వసూలు చేయాలన్న ప్రతిపాదన ఉందని తెలుస్తోంది.

 ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి ఈ పెరుగుదల ఉంటుంది. అంటే ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులపై గరిష్ఠంగా రూ. 35 వరకు పెంపు ఉండగా, కనిష్ఠంగా పది రూపాయల వరకు వినియోగ రుసుమును వసూలు చేయనున్నారు.  అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులకు మాత్రమే పరిమితం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రైల్వే శాఖ త్వరలో పంపనున్నట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉండగా.. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఒకసారి స్టేషన్‌ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్‌ చార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని, అప్పటివరకు ఈ సొమ్మును స్టేషన్‌ అభివృద్దికి వినియోగిస్తామని అధికారులు గతంలో చెప్పారు.  ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. వీటిలో ప్రయాణీకుల నుండి యూజర్ ఫీని వసూలు చేయనున్నారు. 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle