newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

28-10-202028-10-2020 08:41:03 IST
2020-10-28T03:11:03.290Z28-10-2020 2020-10-28T03:11:01.403Z - - 29-11-2020

అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికాతో బెకా ఒప్పందంపై సంతకాలు జరగడం చారిత్రక మైలురాయి అని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భారత్‌-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో కీలక ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో మంగళవారం జరిగిన మూడవ 2+2  మంత్రిత్వ స్ధాయి చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. రక్షణ సంబంధాలపై ఉపయుక్తమైన చర్చలు జరిగాయని, సైనిక సహకారంలోనూ ఇరుదేశాల మధ్య పురోగతి సాధ్యమయ్యేలా చర్చలు సాగాయని తెలిపారు.

బెకా ఒప్పందంతో అమెరికా సైనిక శాటిలైట్స్‌ ద్వారా కీలక సమాచారం, ఇమేజ్‌లను భారత్‌ పొందే వెసులుబాటు కలుగుతుంది. కాగా, దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాల రక్షణలో భారత్‌కు తోడుగా నిలుస్తామని అమెరికా స్పష్టం చేసింది. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే అన్ని రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామని పేర్కొంది. రెండు దేశాల మధ్య మంగళవారం కీలకమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు జరిగాయి. భారత్, అమెరికాల మధ్య ఇవి మూడో విడత 2+2 చర్చలు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్, భారత్‌ తరఫున విదేశాంగ, రక్షణ మంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

తూర్పు లద్దాఖ్‌లో, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో, పలు ఇతర ప్రాంతాల్లో చైనా దూకుడును ఎదుర్కొనే విషయమై చర్చించారు. చర్చల అనంతరం నలుగురు మంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో ఘర్షణల్లో భారత జవాన్లు మృతి చెందిన విషయాన్ని పాంపియో ప్రస్తావించారు. అధికార చైనా కమ్యూనిస్ట్‌ పారీ్ట(సీసీపీ) నుంచి ఎదురయ్యే సవాళ్లతో పాటు అన్ని ఇతర ప్రమాదాలను కలసికట్టుగా ఎదుర్కోవడంలో సహకారం పెంపొందించుకునే దిశగా ఇరుదేశాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే అన్ని రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామనే స్పష్టమైన సందేశాన్ని ఈ చర్చల సందర్భంగా వెలువరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

తూర్పు లడఖ్‌లో చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ ఒప్పందం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  సీసీపీ ప్రజాస్వామ్యానికి, పారదర్శక న్యాయపాలనకు వ్యతిరేకమన్న విషయంలో మనందరికీ స్పష్టత ఉంది. సీసీపీ నుంచే కాకుండా, అన్ని వైపుల నుంచి వచ్చే ముప్పులను భారత్, అమెరికాలు ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి’ అని అన్నారు.

భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. ఇక  కరోనా వైరస్‌, భద్రతా సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ భద్రత, సుస్థిరత కోసం భారత్‌-అమెరికా భాగస్వామ్యం అత్యంత కీలకమని అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రపంచ భద్రత, ఇతర అంశాలపై పాంపియో, ఎస్సర్‌లతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చర్చలు జరిపారు.  ఇక రెండు దశాబ్ధాలుగా భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. అమెరికాతో భాగస్వామ్య విస్తరణ స్వాగతించదగిన పరిణామమని వ్యాఖ్యానించారు. 

పేరుకు బహుళ ద్రువం... ఆధిపత్యమే చైనా సారం

చైనా ఆధిపత్యం భారత్‌కు ఆమోదనీయం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. ‘బహుళ ధృవ ప్రపంచానికి భూమికగా బహుళ ధృవ ఆసియానే ఉండాలి’ అని తేల్చిచెప్పారు చెప్పారు. ‘ఈ ప్రాంతంలోని అన్ని దేశాల్లో శాంతి, సుస్థిరత నెలకొనడం, అన్ని దేశాలు అభివృద్ధి చెందడం కీలకం. అందుకు అంతర్జాతీయ నిబంధనల అమలు, అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానం అత్యంత ఆవశ్యకం’ అని జైశంకర్‌ తెలిపారు. చైనా విస్తరణవాద దుందుడుకు చర్యల నేపథ్యంలో.. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్‌ వాదనకు యూఎస్‌ మద్దతునిస్తుందని అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్‌ స్పష్టం చేశారు. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సహకారం వృద్ధి చెందుతోందన్నారు. భారత్‌ పొరుగు దేశాల్లోని పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయన్నారు. 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle