newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

తేజస్ యుద్ధవిమానాల కొనుగోలుకు భారత్ రెడీ..

14-01-202114-01-2021 14:05:06 IST
2021-01-14T08:35:06.385Z14-01-2021 2021-01-14T08:34:58.319Z - - 24-01-2021

తేజస్ యుద్ధవిమానాల కొనుగోలుకు భారత్ రెడీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాయుసేన అవసరాల కోసం 83 తేజస్ లైట్ కంబాట్ యుద్ధవిమానాలను కొనుగోలుపై కేంద్రప్రభుత్వం  ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నేతృత్వంలో భధ్రతపై కేబినెట్ కమిటీ బుధవారం సమావేశమై 73 తేజస్ ఫైటర్ జెట్లు,  10 ట్రెయినర్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ. 45,700లు. 

తేజస్ లైట్ కంబాట్ యుద్ధవిమానం భారత వాయుసేనకు రాబోయే సంవత్సరాల్లో వెన్నెముకగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఎన్నడూ లేన్నని నూతన సాంకేతిక నైపుణ్యాలను తేజస్ ఇముడ్చుకుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులలో స్వావలంబనకు సంబంధించి ఇదొక మూలమలుపు ఘట్టం కానుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న తేలికపాటి యుద్ధవిమానాల వర్యావరణ వ్యవస్థను గణనీయంగా విస్తరించగలదని, దాంతోపాటు అనేక కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించగలదని కేంద్ర మంత్రి  పేర్కొన్నారు. భారతీయ వైమానిక ఉత్పత్తుల రంగం రూపురేఖలను ఇది మార్చివేయదలదని చెప్పారు.

తేజస్ ఎమ్‌కె-1ఎ తేలికపాటి యుద్ధవిమానం దేశీయంగా తయారు చేసిన నాలుగోతరం యుద్ధవిమానం. ఇది ఆటోమేటిగ్గా ఎలెక్ట్రానిక్ రూపంలో పనిచేసే రాడార్‌ను, ఎలెక్ట్రానికి వార్‌ఫేర్ సూట్‌ని, ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

గత సంవత్సరం మే నెలలో భారత వాయుసేన తేజస్ జెట్లతో కూడిన రెండో స్క్వాడ్రన్‌ను అమలులోకి తీసుకొచ్చింది. వీటిని తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని సులూర్ స్థావరంలోని నంబర్ 18 స్క్వాడ్రన్‌కు అందించింది. ప్లైయింగ్ బుల్లెట్స్ అని పేరుకున్న ఈ స్క్వాడ్రన్‌కి నాలుగో తరం తేజస్ ఎమ్‌కె-1ఎ లైట్ కంబాట్ యుద్ధవిమానాలను జత చేయనున్నారు.

ఒకే వేదికపై మోదీ-మమతా

ఒకే వేదికపై మోదీ-మమతా

   7 hours ago


రైతుల ఆందోళనలు.. తీర్మానాలు ఇక కష్టమే.. తోమర్

రైతుల ఆందోళనలు.. తీర్మానాలు ఇక కష్టమే.. తోమర్

   9 hours ago


రైతుల ఆందోళనపై ప్రభుత్వ వైఖరి భేష్.. 80 శాతం ప్రజల్లో సంతృప్తి

రైతుల ఆందోళనపై ప్రభుత్వ వైఖరి భేష్.. 80 శాతం ప్రజల్లో సంతృప్తి

   11 hours ago


వ్యాక్సిన్ల తయారీలో భారత్ స్వావలంబన.. ప్రధాని మోదీ

వ్యాక్సిన్ల తయారీలో భారత్ స్వావలంబన.. ప్రధాని మోదీ

   13 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్తగా 14,256 కరోనా కేసులు

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్తగా 14,256 కరోనా కేసులు

   14 hours ago


తాజా చర్చలూ విఫలం.. ఇక బంతి మీ కోర్టులోనే ఉందన్న కేంద్రం

తాజా చర్చలూ విఫలం.. ఇక బంతి మీ కోర్టులోనే ఉందన్న కేంద్రం

   15 hours ago


తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దొంగలను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దొంగలను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

   12 hours ago


మూడోసారి మోదీనే ప్రధాని.. తాజా సర్వేలో సంచలన విషయాలు

మూడోసారి మోదీనే ప్రధాని.. తాజా సర్వేలో సంచలన విషయాలు

   18 hours ago


వంద నోటుకి మూడింది.. వ‌చ్చే నెల‌లో మాయం

వంద నోటుకి మూడింది.. వ‌చ్చే నెల‌లో మాయం

   16 hours ago


భారత్ వ్యాక్సిన్ దౌత్యం... చైనాకు చెక్ చెప్పడానికేనా?

భారత్ వ్యాక్సిన్ దౌత్యం... చైనాకు చెక్ చెప్పడానికేనా?

   22-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle