newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

చైనా ఎత్తుకు భారత్ పైఎత్తు.. బ్రహ్మపుత్రపై రిజర్వాయర్

02-12-202002-12-2020 12:07:12 IST
2020-12-02T06:37:12.590Z02-12-2020 2020-12-02T06:29:03.931Z - - 28-01-2021

చైనా ఎత్తుకు భారత్ పైఎత్తు.. బ్రహ్మపుత్రపై రిజర్వాయర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా భూభాగంలోని బ్రహ్మపుత్ర నదిపై 60 గిగావాట్ల భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఎత్తుకు పై ఎత్తుగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగా వాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది. చైనా నీటి ప్రాజెక్టుల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర జలవనరుల శాఖ సీనియర్‌ అధికారి టీఎస్‌ మెహ్రా అన్నారు. తమ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. ఇది కార్యరూపం దాల్చితే చైనా డ్యామ్‌ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు భారీగా నీటి నిల్వకు వీలుంటుందన్నారు. 

అయితే రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు నదీ జల వివాదాలు కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. యర్లుంగ్‌ త్సంగ్‌ బో (బ్రహ్మపుత్రకు చైనా పేరు) నదిపై 60 గిగావాట్ల భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా ప్రాజెక్టుల కారణంగా భారత్‌లో అకస్మాత్తుగా వరదలు రావడం, నీటి కొరత ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం.

బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు.. చైనా దూకుడు!

హిమాలయ నదుల్లో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందిన బ్రహ్మపుత్ర నదిపై భారీ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. 14వ పంచవర్ష ప్రణాళిక(2021-25) అమలులో భాగంగా టిబెట్‌లో ఈ మేరకు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనాఅధికార మీడియా వెల్లడించింది. చైనా సొసైటీ ఫర్‌ హైడ్రోపవర్‌ ఇంజనీరింగ్‌ 40వ వార్షికోత్సవం సందర్భంగా విద్యుదుత్పత్తి కార్పొరేషన్‌ చైర్మన్‌ యాన్‌ జియాంగ్‌ మాట్లాడుతూ.. చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలా జరుగలేదు. చైనీస్‌ జలవిద్యుత్‌ పరిశ్రమలో ఇదొక నూతన అధ్యాయం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని టిబెట్‌లో యార్లాంగ్‌ జాంగ్బో(బ్రహ్మపుత్ర) నదిపై హైడ్రోపవర్‌ ప్రాజెక్టును నిర్మించనుంది అని వ్యాఖ్యానించినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. 

టిబెట్‌- అరుణాచల్‌ సరిహద్దులోని మెడాగ్‌ సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, జాతీయ భద్రత, నదీ జలాలు, అంతర్గత భద్రత తదితర అంశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో ఇతర దేశాలు ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(జాతీయ అసెంబ్లీ) వచ్చే ఏడాది ఆమోదించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా జాతీయ ఆర్థిక, సామాజికాభివృద్ధి ప్రణాళికలో భాగంగా 2035 నాటికి సాధించాల్సిన లక్ష్యాల గురించి తీర్మానం చేస్తూ చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ గత నెలలో నిర్ణయం తీసుకుంది.

Why India is worried about China's dam projects on the Brahmaputra river -  The Economic Times

ఇక ఈశాన్య రాష్ట్రాల వరప్రదాయిని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మాణాల నేపథ్యంలో ఇటు భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి టిబెట్‌లో బ్రహ్మపుత్రతో పాటూ.. జిన్షా, లాన్‌శాంగ్‌, నుజియాంగ్‌ నదులు ప్రవహిస్తున్నాయి. జలవిద్యుత్‌కు బ్రహ్మపుత్రతో పాటు ఇవి కూడా అనుకూలమైనవనని నిపుణులు ఇప్పటికే తేల్చినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటన్నింటినీ కాదని, భారత్‌లో ప్రవహించే బ్రహ్మపుత్రపైనే చైనా దృష్టి పెట్టడం గమనార్హం. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చల్లారేలా చర్చలు జరుగుతున్న వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాలకు నష్టం చేకూర్చేవిధంగా వ్యవహరించవద్దని భారత్‌ ఇప్పటికే చైనాకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. డ్రాగన్‌ దేశ నిర్ణయాల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే దిగువ ప్రాంత ప్రయోజనాలు కాలరాసే విధానాన్ని సహించబోమని తమ వైఖరిని స్పష్టం చేసింది. 

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

   2 hours ago


పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

   3 hours ago


నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

   4 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

   5 hours ago


ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

   5 hours ago


ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

   7 hours ago


అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

   8 hours ago


ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

   19 hours ago


డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

   27-01-2021


భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

   27-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle