newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

భార‌త్‌-చైనా మ‌ధ్య కార్ప్స్ కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు

04-10-202004-10-2020 14:59:19 IST
2020-10-04T09:29:19.533Z04-10-2020 2020-10-04T09:29:15.589Z - - 21-10-2020

భార‌త్‌-చైనా మ‌ధ్య కార్ప్స్ కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే..! ఇరు దేశాలు తమ అత్యుత్తమ ఆయుధాలను సరిహద్దులో మోహరించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ భారీగా యుద్ధ ట్యాంకులను మోహరిస్తోంది. తూర్పు లఢఖ్‌లోని చుమర్-దెమ్‌చోక్ ప్రాంతానికి ట్యాంకులు చేరుకున్నాయి. చుమర్-దెమ్‌చోక్ లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో టీ-90 బీష్మ యుద్ధ ట్యాంకులను నడిపింది భారత సైన్యం. శీతాకాలంలో యుద్ధ ట్యాంకుల పని విధానంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి మూడు రకాల ఇంధనాలును ఉపయోగిస్తోంది ఇండియన్ ఆర్మీ. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేయగల బీఎంపీ-2 వాహనాలు, టీ-90, టీ-72 ట్యాంకులు లక్ష్యాన్ని ఛేదించగలవు. 

ఇలాంటి ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త్‌-చైనా మ‌ధ్య మ‌రోసారి కార్ప్స్ కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జ‌రగ‌నున్నాయి. అక్టోబర్ 12న తూర్పు ల‌ఢక్ సెక్టార్ ప్రాంతంలో ఈ చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని ఆర్మీవ‌ర్గాలు తెలిపాయి. ఈ సంద‌ర్భంగా ఇరుదేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న సైనిక ప్ర‌తిష్టంభ‌న‌పై అధికారులు చ‌ర్చించే అకాశం ఉంద‌ని వెల్ల‌డించారు. ఆరుసార్లు కార్ప్స్ కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జరిగినప్పటికీ పెద్దగా మార్పు రావడం లేదు. జూన్ నెల‌లో ల‌ఢ‌క్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసింది. ఈసంద‌ర్భంగా చైనా బ‌ల‌గాలు భార‌త సైనికుల‌పై రాడ్లు, క‌త్తుల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడిచేశారు. దీంతో 20 మంది సైనికులు మృతిచెందారు. అప్ప‌టినుంచి భార‌త్, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 

భారత్-చైనా దౌత్యపరమైన చర్చలు బుధవారం జరిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుత పరిస్థితిని ఇరు పక్షాలు సమీక్షించాయి. సరిహద్దుల్లోని ఉద్రిక్తతలకు తెర దించడానికి ఇరు దేశాల రక్షణ మంత్రులు రష్యాలో జరిపిన చర్చల్లో రూపొందించిన ఐదు సూత్రాలపై ప్రధాన దృష్టితో ఈ చర్చలు జరిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఎల్ఏసీ వెంబడి ప్రస్తుత పరిస్థితిని భారత్, చైనా సమీక్షించినట్లు తెలిపింది. ఆగస్టు 20న డబ్ల్యూఎంసీసీ సమావేశం అనంతరం జరిగిన పరిణామాలపై చర్చించినట్లు పేర్కొంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle