newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

30-09-202030-09-2020 13:13:54 IST
Updated On 30-09-2020 16:03:14 ISTUpdated On 30-09-20202020-09-30T07:43:54.537Z30-09-2020 2020-09-30T07:43:50.352Z - 2020-09-30T10:33:14.648Z - 30-09-2020

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌లో ఓ యువతిని నాలుక కోసి అత్యాచారం చేసిన ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. హత్రస్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఈ నెల 14న తన అమ్మ, సోదరుడితో కలిసి గడ్డి కోసం పంట పొలాల్లోకి వెళ్లారు. గడ్డి కోసుకుని ముందే సోదరుడు ఇంటికి వచ్చాడు. తల్లి, కూతురు పొలంలోనే ఉండిపోయారు. తల్లికి కొద్ది దూరంలో ఉన్న ఆ యువతిని నలుగురు దుండగులు సమీపంలో ఉన్న సజ్జ చేనులోకి లాక్కెల్లి.. అరవకుండా నాలుక కోసేశారు. పొలంలోనే ఉన్న తల్లి కూతురు కోసం వెతకగా పొలాల్లో కనిపించింది. అప్పటికే బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 

అక్కడ్నుంచి అలీఘర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అత్యాచారానికి గురైన యువతి శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయి, నాలుక తెగిపోయి, అవయవాలు పనిచేయని స్థితిలో మరణించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవలే నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారని, 14వ తేదీన ఫిర్యాదు చేస్తే నాలుగైదు రోజుల తర్వాత కేసు నమోదు చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ యువతి కుటుంబ సభ్యులు  మండిపడుతున్నారు. తమ సంప్రదాయానికి విరుద్ధంగా అర్ధరాత్రి శవ దహనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురాగా.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండడంతో రాత్రి రాత్రే అంత్యక్రియలు చేయాలని పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులకు సూచించారు. తమ సంప్రదాయానికి విరుద్ధమని, శవాన్ని ఇంటికి తీసుకువెళ్లి, రేపు ఉదయమే దహనం చేస్తామని ఆమె తండ్రి పోలీసులకు చెప్పినప్పటికీ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో పోలీసులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తమ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూతురిని కడచూపునకు నోచుకోకుండా చేశారంటూ ఆమె తల్లి గుండెలు బాదుకుంటూ రోదించింది.

ఆసుపత్రి వద్దే తానున్నా, కనీసం చెప్పను కూడా చెప్పకుండా మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారని యూపీ పోలీసులపై బాధితురాలి సోదరుడు నిప్పులు చెరిగారు. ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటంతోనే, మరింత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడకుండా చూసేందుకు, శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా చూసేందుకు మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

ఈ ఘటనపై యూపీ సర్కార్ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అఘాయిత్యాలకు సమాధానం చెప్పాలని పలు పార్టీలకు చెందిన నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle