newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

భారత గగనతలాన్ని ఇమ్రాన్ ఖాన్ వాడుకోవచ్చు

23-02-202123-02-2021 14:16:17 IST
2021-02-23T08:46:17.126Z23-02-2021 2021-02-23T08:46:14.556Z - - 04-03-2021

భారత గగనతలాన్ని ఇమ్రాన్ ఖాన్ వాడుకోవచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయాణించే విమానం భారత గగనతలం మీదుగా శ్రీలంక వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 23న ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక పర్యటకు వెళుతుండగా, ఆ విమానం భారత్ మీదుగా వెళ్లనుంది.  ఇమ్రాన్ ఖాన్ తన మంత్రివర్గ సహచరులు, అధికారుల బృందంతో కలిసి రెండు రోజుల పర్యటనకు శ్రీలంకకు వెళ్లనున్నారు. ఇందుకు భారత్‌ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ దేశం చేసిన విజ్ఞప్తికి భారత్‌ సానుకూలంగా స్పందించింది.  శ్రీలంక పర్యటనలో ఇమ్రాన్‌ ఆ దేశ ప్రధాని మహీంద రాజపక్సేతో సమావేశవుతారని పాక్‌ విదేశాంగ కార్యాలయం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సాంకేతిక, రక్షణ, పర్యాటరంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారని, ప్రధాని రాజపక్సే ఆహ్వానం మేరకు ఇమ్రాన్‌ శ్రీలంక పర్యటనకు వెళ్తున్నారని విదేశాంగ కార్యాలయం పేర్కొంది.

 ఇక శ్రీలంక పర్యటనకు వెళ్లకముందే శ్రీలంక ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ఇచ్చింది.  శ్రీలంక పర్యటనలో ఆ దేశ పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాల్సి ఉన్నా.. ఆయన ప్రసంగాన్ని రద్దు చేశారు. భారత్‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశ్యంతోనే శ్రీలంక ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ ప‌త్రిక త‌న క‌థ‌నంలో ప్రచురించింది. కొలంబో పోర్టులోని ఈస్ట్ కంటైనర్ టర్మినల్ నిర్మాణం కోసం భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని శ్రీలంక ఇటీవలే రద్దు చేయడం వెనుక చైనా హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక పార్లమెంట్‌లో పాక్ ప్రధాని నోట కశ్మీర్ ప్రస్తావన వస్తే.. శ్రీలంక-భారత్ దేశాల దౌత్యసంబంధంపై మరింత ప్రభావం పడుతుందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్‌ శ్రీలంకకు కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌లను అందిస్తోంది. ఇప్పటికే 5 లక్షల కోవిషిల్డ్‌ డోసులను ఆ దేశానికి పంపించింది. ఇలాంటి సమయంలో భారత్‌తో తమకున్న దౌత్య సంబంధాన్ని పణంగా పెట్టేందుకు శ్రీలంక సిద్ధంగా లేదు. ఇక ఇమ్రాన్ ఖాన్ గురించి తెలిసిందే..‌ అంతర్జాతీయ వేదికలపై జమ్మూకశ్మీర్‌పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. శ్రీలంకలో కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ జమ్మూకశ్మీర్ అంశం లేవనెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రసంగం రద్దు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే శ్రీలంక ప్రభుత్వం  ఆ దేశ పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాల్సి ఉన్నా.. ప్రసంగాన్ని రద్దు చేసింది. 

 

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు

   3 hours ago


కరోనా టీకాపై ఆంక్షల తొలగింపు.. ఇకపై 24 గంటలూ టీకా

కరోనా టీకాపై ఆంక్షల తొలగింపు.. ఇకపై 24 గంటలూ టీకా

   4 hours ago


ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ

ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ

   5 hours ago


కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్

   6 hours ago


తాజ్ మహల్ లో బాంబు పెట్టాను.. ఇంకొద్ది సేపట్లో..!

తాజ్ మహల్ లో బాంబు పెట్టాను.. ఇంకొద్ది సేపట్లో..!

   7 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!

   9 hours ago


ఫ్రెంచ్ యువ‌తిని రేప్ చేసిన ఢిల్లీ మ‌హిళ‌.. కేసు న‌మోదు

ఫ్రెంచ్ యువ‌తిని రేప్ చేసిన ఢిల్లీ మ‌హిళ‌.. కేసు న‌మోదు

   8 hours ago


రాసలీలల మంత్రిగారు.. రాజీనామా చేసేశారు

రాసలీలల మంత్రిగారు.. రాజీనామా చేసేశారు

   03-03-2021


హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!

హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!

   03-03-2021


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా..!

   03-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle