newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస

26-09-202026-09-2020 11:37:09 IST
Updated On 26-09-2020 11:47:43 ISTUpdated On 26-09-20202020-09-26T06:07:09.224Z26-09-2020 2020-09-26T06:07:05.343Z - 2020-09-26T06:17:43.839Z - 26-09-2020

ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్-19 వైరస్ షాక్ నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుందంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ మొదలెట్టిన ఆత్మనిర్భర భారతే కారణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రశంసింసింది. మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ (స్వావలంబన భారత్‌) కార్యక్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. ‘‘స్వావలంబన భారత్‌ (తన అవసరాలకు తనపైనే ఆధారపడడం) కార్యక్రమం కింద ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ భారత ఆర్థిక వ్యవస్థకు సాయపడింది. మరింత అగాథంలోకి పడిపోకుండా కాపాడింది. కనుక ఈ కార్య్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా చూస్తున్నాము. 

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచం కోసం తయారీ అన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను.. అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్‌ మరింతంగా చొచ్చుకునిపోయే విధానాలపై దృష్టి పెట్టాలి’’ అంటూ ఐఎంఎఫ్‌ డైరెక్టర్‌ గెర్రీరైస్‌ వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా చెప్పారు. అందుకు ఆర్థిక వ్యవస్థ సామర్థ్య, పోటీతత్వాన్ని ఇనుమడింపజేసే విధానాలను అనుసరించడం కీలకమవుతుందని చెప్పారు.

అయతే ఆరోగ్యసంరక్షణ రంగంలో స్థిరమైన వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు భారత్‌ జీడీపీలో ప్రస్తుతం ఈ రంగానికి కేటాయిస్తున్న 3.7 శాతాన్ని క్రమంగా పెంచాల్సి ఉందన్నారు. మధ్య కాలానికి మరింత సమ్మిళిత, స్థిరమైన వృద్ధిని సాధించేందుకు సమగ్రమైన, నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.   

కోవిడ్-19 వ్యాప్తితో కోట్లాది ఉద్యోగాలు కోల్పోయిన భారత్‌ను ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద కేంద్రప్రభుత్వం అందించిన ఆర్థిక ప్యాకేజీ నిజంగానే ఆదుకుందనే చెప్పాలి. దీంట్లో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కోట్లాది మంది భారతీయులకు రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వడాన్ని  నవంబర్ చివరి వరకు కేంద్రప్రభుత్వం కొనసాగించడం కూడా తెలిసిన విషయమే.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle