newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

ఇదేంద‌య్యా ఇది

29-10-202029-10-2020 08:19:27 IST
Updated On 29-10-2020 09:35:22 ISTUpdated On 29-10-20202020-10-29T02:49:27.865Z29-10-2020 2020-10-29T02:49:20.038Z - 2020-10-29T04:05:22.021Z - 29-10-2020

ఇదేంద‌య్యా  ఇది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌నం బా ముదిరిపోయారండీ. మామూలుగా కాదు. క‌రోనాని తొక్కి  ప‌ట్టి నార తీసేలా ఉన్నారు. చూస్తుంటే తెలుస్తుంది క‌దా. ఇదేదో పాత ఫోటో కాదు. మ‌నం అన్ని చోట్లా చూసే బొమ్మే ఇది. జ‌స్ట్ బ‌య‌టికెళ్లిన‌ప్పుడు కాస్త హైట్ నుంచి చూడండి. ఇంత‌కు మించిన క్రౌడ్ క‌నిపిస్తుంది. అవును నిజ‌మే.. జ‌నాలు క‌రోనాని చాలా లైట్ తీసుకున్నారు. అప్ప‌ట్లో జ‌నం వెన్నులో వ‌ణుకు పుట్టేది. క‌రోనా పేషెంట్ క‌నిపిస్తేనే ద‌డుసుకునే వాళ్లు. ఇప్పుడు అదే క‌రోనా ముక్కులో దూరినా.. తుమ్మి.. ఆ పోయిందిలే అంటున్నారు.

గొంతులో దూరితేనేమో.. వేడి వేడి టీ తాగి.. ఆ చ‌చ్చిందిలే అంటున్నారు. క‌రోనా ట్రీట్మెంట్ అంత ఈజీ అని ఫీల్ అవుతున్నారు. ఇక కేసుల సంఖ్య కూడా బాగా త‌గ్గింది. కేసుల సంఖ్య‌తో పాటు.. కేసుల్లో చ‌నిపోయే వారి సంఖ్య కూడా ఇంకా త‌గ్గింది. డాక్ట‌ర్ల‌కి కూడా ట్రీట్మెంట్ ఈజీ అయిపోయింది. అదో ఇదో కాంబినేష‌న్ క‌లిపి.. బాడీలో ఉన్న క‌రోనాని ఖ‌తం చేసేస్తున్నారు. జ‌నం అప్డేట్ అయ్యారు క‌దా. అప్డేట్స్ ఇమీడియ‌ట్ గా తెలుసుకుంటున్నారు. తొక్క‌లో క‌రోనాని చంప‌డానికి డాక్ట‌ర్ల ద‌గ్గ‌రికి పోవాలా.. నేను ట్రీట్మెంట్ చేస్తా ఆగు అని.. లోక‌ల్ ఆర్ఎంపీ కూడా వ‌చ్చేస్తున్నాడు. మూతికి మాస్కులేకుండానే క‌రోనాకి ట్రీట్మెంట్  చేస్తున్నారు. అదేంటీ అంటే.. తుమ్మితేనే క‌దా బ‌య‌టికొచ్చేది.. తుమ్మ‌కాకు అంటున్నారు. 

జ‌నం కూడా లైట్ తీసుకుంటున్నారు.  క‌రోనా పేషెంట్ ఉన్న ఏరియాని బ్లాక్ చేసిన రోజుల్ని మొన్న‌నే చూశాం. ఆ ఏరియా క‌రోనా త‌గ్గిన  త‌ర్వాత వెళ్ల‌డానికి కూడా భ‌య‌ప‌డ్డాం. ఇప్పుడు క‌రోనా పేషెంట్ ని ఇంట్లోనే పెట్టుకుని..  ఏం కాద్ లే లైట్ ర భ‌య్ అంటున్నాం. అన్నం కూడా క‌లిసే తింటున్నాం. 

పోలీసుల శ‌క్తి పై జ‌నం భ‌క్తి దే విజ‌యం..

పేషెంట్ ఇంట్లో కూర్చోవ‌డం లేదు. బ‌య‌టికొచ్చి అరుగుల మీద కూర్చోని ముచ్చ‌ట్లు పెడుతున్నారు. క‌రోనా ఏం చేయ‌లేదు అనే ధైర్య‌మా.. మ‌నకి రాదు అనే న‌మ్మ‌క‌మా.. మెడిసిన్ వ‌స్తుందిలే అనే కాన్ఫిడెన్సా అంటే.. అన్నీ ఉన్న‌య్ జ‌నాల్లో. అందుకే.. తాపీగా తిరుగుతున్నారు. ఇంకా స‌ర్కార్ లే కాస్త యాక్ట్ చేస్తున్న‌య్.  రూల్స్ గ‌ట్రా అంటూ ప‌ట్టుకుని వేలాడుతున్న‌య్ కానీ.. జ‌నం పిచ్చి లైట్ తీసుకుంటున్నారు. అయిపోయింది ఇప్పుడు క‌రోనా కానొస్తే క‌ర్రు కాల్చి వాత పెడ‌తం అంటున్న‌రు జ‌నాలు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle