newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

పెట్టుబడులకు స్వర్గధామంగా భారత విద్యా రంగం

27-11-202027-11-2020 12:40:53 IST
2020-11-27T07:10:53.773Z27-11-2020 2020-11-27T07:10:50.382Z - - 16-01-2021

పెట్టుబడులకు స్వర్గధామంగా భారత విద్యా రంగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలో ఏ దేశంతో పోల్చి చూసినా సరే.. భారత విద్యా రంగం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశాల్లో రెండో స్థానంలో ఉన్న మన దేశంలో మూడింట ఒక వంతు జనాభా విద్యారంగ సంబంధిత వినియోగంలోని వారు కావడమే ఇందుకు కారణమని విశ్లేషకులుపేర్కొంటున్నారు. దేశంలో విద్యా రంగంలోని పెట్టుబడులు అవకాశాలపై ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ (ఐబీఈఎఫ్‌) తాజా నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. విద్యకు ప్రాముఖ్యత గతంలో కన్నా ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం వారు ఎక్కువగానే వెచ్చిస్తున్నారు. 

ఇటీవలి గణాంకాల ప్రకారం 0-14 మధ్య వయసుగల చదువుకొనే పిల్లలు దేశ జనాభాలో 29 శాతం ఉన్నారు. అందువల్లే విద్యారంగం మంచి అవకాశాలకు నిలయంగా మారుతోందని ఆ నివేదిక వివరించింది. ఈ దృష్ట్యా దేశంలో విద్యా రంగం పెట్టుబడులు 2020-21లో రూ.13.32 లక్షల కోట్లకు (180 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు) చేరుకుంటాయని అంచనా. ఉన్నత విద్య విభాగంలో 2025 నాటికి రూ.2,44,824 కోట్లకు పెరుగుతుందని లెక్కగడుతున్నారు. 

దేశంలో విద్యావకాశాలకు భూమిక..

దేశంలో స్కూళ్లకు వెళ్లే పిల్లలు 250 మిలియన్లకు పైగా ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడే వీరి సంఖ్య ఎక్కువ. ప్రపంచంలోని ఉన్నత విద్యా సంస్థల అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఇండియా ఒకటి. 2019-20లో దేశంలో  39,931 కళాశాలలు, 993 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2018-19 గణాంకాల ప్రకారం దేశంలో సెకండరీ, హయ్యర్‌ సెకండరీ విద్య పూర్తి చేసుకున్న వారిలో 37.4 మిలియన్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చేరారు. జనాభాలో రెండవ స్థానం, 5-24 మధ్య వయస్కుల సంఖ్య 500 మిలియన్ల (50 కోట్లు)కు పైగా ఉండడం వల్ల విద్యా రంగంలో అపార అవకాశాలు వస్తున్నాయి. 

ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ ఇండెక్స్‌-2019 గణాంకాల ప్రకారం ఇంగ్లీషు మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉన్న 100 దేశాల్లో ఇండియాది 34వ స్థానం కావడం. ఇంటర్నెట్‌ వ్యాప్తి పెరగడం గత ఏడాది చివరకు 54.29 శాతానికి చేరుకుంది. కోవిడ్‌ నేపథ్యంలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా విభాగాలలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, బ్లెండెడ్‌ (మిశ్రమ) విధానంలో ఆయా సంస్థలు విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇది చదవండి: బ్రాండ్‌ ఇండియాకు విద్యార్థులే బ్రాండ్‌ అంబాసిడర్లు.. ప్రధాని మోదీ..

నేషనల్‌ అక్రిడిటేషన్‌ రెగ్యులేటరీ అథారిటీ బిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఫారెన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో నేరుగా 100 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ జాతీయ నూతన విద్యా విధానం-2020 ద్వారా అనేక సంస్కరణలకు తెరతీసింది. సుస్థిర అభివృద్ధికి వీలుగా 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాల ప్రణాళికతో దీన్ని రూపొందించారు. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు ప్రభుత్వం రూ.59,845 కోట్లు (8.56 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు) కేటాయించింది.

2022 నాటికి ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ (ఆర్‌ఐఎస్‌ఈ)ను పునరుద్ధరించడం కోసం తాజా బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు (429.55 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు) వ్యయం చేయనున్నారు. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ నిధులు కేటాయిస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. పెద్ద సంఖ్యలో వైద్యులు, ఇతర సిబ్బందికి వీలుగా వైద్య విద్యా రంగాన్ని పటిష్టం చేస్తోంది. 

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

   25 minutes ago


భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

   7 hours ago


వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

   5 hours ago


ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

   8 hours ago


భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

   9 hours ago


ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

   10 hours ago


తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

   11 hours ago


భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

   12 hours ago


కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

   12 hours ago


ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

   15-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle