newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

29-10-202029-10-2020 08:06:12 IST
Updated On 29-10-2020 09:06:37 ISTUpdated On 29-10-20202020-10-29T02:36:12.662Z29-10-2020 2020-10-29T02:36:10.745Z - 2020-10-29T03:36:37.870Z - 29-10-2020

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మరో నాలుగేళ్లు ట్రంప్‌కే అమెరికన్లు అధికారం కట్టబెడితే అమెరికా పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. మరోసారి ట్రంప్ గెలుస్తాడనే ఆ ఆలోచనే తనకు రూచించడం లేదన్నారు. ఆ ఆలోచన వస్తే కడుపులో వికారంగా ఉంటుందని హిల్లరీ తెలిపారు. అందుకే ఈసారి ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని ఆమె హితువు పలికారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో కూడా ట్రంపే గెలిస్తే మాత్రం అది మనకు పెద్ద గుణపాఠం కాబోతోందని జోస్యం చెప్పారు.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో ఆ దేశ మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్... ఈసారి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మళ్లీ ట్రంప్ చేతికి పగ్గాలు ఇస్తే దేశం దుర్భర పరిస్థితులను ఎదుర్కొవడం ఖాయమని హిల్లరీ చెప్పుకొచ్చారు. ఈసారి కూడా ఆయన గెలుస్తారనే ఆ ఆలోచనే నాకు కడుపులో తిప్పినట్టుగా అనిపిస్తుంది. ఆ మాటను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే ట్రంప్ నాలుగేళ్ల పాలనలో దేశంలో పరిస్థితులు ఎంటనేది ప్రజలు చూశారు. మరో నాలుగేళ్లు ఆయనకు అధికారం ఇస్తే ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. కనుక ఈసారి బాగా ఆలోచించి మీ అమూల్యమైన ఓటును సరియైన వ్యక్తికి వేయండి. అని హిల్లరీ అన్నారు.  

కమలా హ్యారిస్ కరెక్ట్ పర్సన్.. హిల్లరీ ప్రశంసలు

ఇక ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను ఢీకొనబోతున్న జో బైడెన్, కమలా హ్యారిస్‌ల విజయంపై ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈసారి డెమొక్రటిక్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ సందర్భంగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో మీరు చోటును కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు హిల్లరీ తనదైనశైలిలో సమాధానం చెప్పారు. నాకు ఎలాంటి జాబ్ వద్దు. నేను వారిని ఉత్సాహపరచాలని మాత్రమే అనుకుంటున్నాను. బైడెన్, హ్యారిస్ గెలవాలి. కమలాతో చాలాసార్లు మాట్లాడాను. ఆమె నిజంగా పవర్‌ఫుల్ ఉమెన్. ఆ పదవికి ఆమె కరెక్ట్ పర్సన్. ఇది చాలా పెద్ద ముందడుగు అని నా అభిప్రాయం అని హిల్లరీ అన్నారు. 

కాగా, 2016 ఎన్నికల్లో ట్రంప్ చేతిలో హిల్లరీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, ఆ ఎన్నికల్లో హిల్లరీకి 30 లక్షల ఓట్లు అధికంగా వచ్చినప్పటికీ సీట్ల సంఖ్య పరంగా ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత ట్రంప్ విధానపరమైన నిర్ణయాలతో పాలన కొనసాగించారు. తాను ఏ నిర్ణయం తీసుకున్న దానికి వత్తాసు పలికే వారినే తన బృందంలో పెట్టుకుని తనకు నచ్చిన విధంగా పాలించారు. అటు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ట్రంప్ సరియైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో అమెరికా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

భారీ మెజార్టీతో జో, కమలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. ట్రంప్ ధీమా

కాగా, నవంబర్ 3న జరగనున్న ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్న డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ సైతం ఒకరిపై ఒకరు విమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. ట్రంప్, బైడెన్‌ల మధ్య జరిగిన చివరి సంవాదం కూడా వాడివేడిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఇంకా పోలింగ్‌కు వారం రోజుల గడువు మాత్రమే ఉంది. అయితే, ఇప్పటికే 5.9 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో దాదాపు నాలుగోవంతు ఓటర్లు ముందస్తుగా ఓటు వేయడం అమెరికా చరిత్రలోనే ఓ రికార్డు.  దేశవ్యాప్తంగా మహమ్మారి ఉధృతి కొనసాగుతుండడంతో పోలింగ్‌ కేంద్రాలకు రావడానికి సాహసించని ఓటర్లు ఈసారి పోస్టల్‌, ఈమెయిల్‌ బ్యాలెటింగ్‌కు మొగ్గుచూపారు. దీంతో ముందస్తు ఓటింగ్ శాతం అమాంతం పెరిగింది. పోలింగ్ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle