newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

హత్రాస్‌ కేసును విచారిస్తున్న అధికారి భార్య ఆత్మహత్య

25-10-202025-10-2020 13:12:16 IST
2020-10-25T07:42:16.163Z25-10-2020 2020-10-25T07:34:46.607Z - - 03-12-2020

హత్రాస్‌ కేసును విచారిస్తున్న అధికారి భార్య ఆత్మహత్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ కేసు విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంలోని ఓ పోలీస్ అధికారి భార్య ఆత్మహత్య చేసుకుంది. సిట్ బృందంలో ఒకరైన డీఐజీ చంద్ర ప్రకాశ్ భార్య పుష్ప లక్నోలోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్‌కు వేలాడుతోన్న ఆమెను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను లోహియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు. ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.

సిట్‌ సభ్యుల్లో ఒకరైన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ చంద్ర ప్రకాష్‌ భార్య పుష్ప ప్రకాష్‌ మరణించిందన్న వార్త స్థానికంగా సంచలనం రేపుతోంది. ఆమె వయసు 36 సంవత్సరాలు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లక్నోలోని వారి నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. 2005 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన చంద్ర ప్రకాష్‌‌ ప్రస్తుతం హథ్రాస్‌ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్నారు. 

హత్రాస్ కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల బాధితురాలి సామాజిక వర్గం(వాల్మీకి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ వర్గానికి చెందిన 50 కుటుంబాలకు చెందిన 236 మంది ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఘజియాబాద్‌లోని కర్హేడా ప్రాంతంలో అక్టోబర్ 14న చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాల్మీకి వర్గానికి చెందిన 236 మంది ప్రజలందరు బౌద్ధమతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ముని ముని మనవడు రాజరత్న సమక్షంలో వీరు బౌద్ధంలోకి మారారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle