newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

ట్రంప్ కు కాలేలా ప్రకటన చేసిన పర్యావరణం పిల్ల

11-10-202011-10-2020 12:03:23 IST
Updated On 11-10-2020 12:27:25 ISTUpdated On 11-10-20202020-10-11T06:33:23.793Z11-10-2020 2020-10-11T06:33:12.387Z - 2020-10-11T06:57:25.180Z - 11-10-2020

ట్రంప్ కు కాలేలా ప్రకటన చేసిన పర్యావరణం పిల్ల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీలు ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించడం మొదలుపెట్టారు. తాజాగా పర్యావరణ సంరక్షకురాలిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న గ్రేటా థన్‌బర్గ్ కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రకటన గుప్పించింది. పర్యావరణ మార్పులపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు పట్టించుకోవడం లేదని గ్రేటా థన్‌బర్గ్ ఎప్పటి నుండో ఆరోపణలు గుప్పిస్తూ ఉంది.

చాలా సార్లు ట్రంప్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన గ్రేటా తాజాగా డొనాల్డ్ ట్రంప్ ను అధ్యక్ష పదవిలో నుండి దింపేయాలని పిలుపును ఇచ్చింది. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు తన మద్దతును ప్రకటించింది. ఆ దేశంలోని ఓటర్లంతా బైడెన్‌ ను ఎన్నుకోవాలని థన్‌బర్గ్ కోరారు.  ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం రోజురోజుకీ నాశనం అయిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రేటా ట్రంప్ కు కాలేలా ప్రకటన చేసింది. బైడెన్‌ గత కొద్దిరోజులుగా ఆమె చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలుపుతూ వచ్చారు. పర్యావరణం విషయంలో వస్తున్న మార్పులపై పోరాడాల్సిందే అని జో బైడెన్ ఇప్పటికే చెప్పారు.  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కరోనాకు చికిత్స తరువాత తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైట్ హౌస్ వేదికగా, ట్రంప్ తన మాస్క్ ను తీసేసి మరీ ప్రసంగించారు. తానిప్పుడు చాలా బాగున్నాను అని ట్రంప్ ప్రసంగించారు. అమెరికాను గొప్పగా నిలబెట్టేందుకు సిద్ధంగాఉన్నాను. మరొక్క నాలుగేళ్లు నాకు అవకాశం ఇవ్వమని కోరుతున్నాడు. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలవడం కష్టమేనని సర్వేలు చెబుతూ ఉన్నాయి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle