newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

08-04-202108-04-2021 14:25:46 IST
2021-04-08T08:55:46.801Z08-04-2021 2021-04-08T08:55:34.206Z - - 16-04-2021

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంతవరకు నిర్దేశించిన కేంద్రాల్లో మాత్రమే కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేట్ పనిస్థలాల్లో కూడా వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి మంజూరు చేయనుంది. దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి అమలవుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం చర్యలు చేపట్టనుంద.

రోజుకు 30 నుంచి 40 లక్షలకు పైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న భారత్, ప్రపంచంలో ఒక రోజులో అత్యధిక జనాబాకు టీకాలు అందిస్తున్న తొలి దేశంగా రికార్డు కెక్కింది. ఈ విషయంలో అమెరికాను కూడా అధిగమించిన భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

వ్యాక్సినేషన్ అమలును త్వరితం చేసే ఉద్దేశంతో వంద మంది అర్హులు, లబ్దిదారులు పనిచేస్తున్న ఆఫీసుల్లో కూడా కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఏప్రిల్ 11 నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పనిస్థలాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కోవిడ్-19 వ్యాక్సిన్ పరిధిలోకి మరింత మందిని తీసుకురావాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కేసులు తీవ్రమవుతుండటంతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వ్యాక్సిన్ వేయడానికి వయో పరిమితిని తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

ఇప్పటివరకు 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాధులతో నిమిత్తం లేకుండా టీకాలు వేయాలని కేంద్రం నిర్దేశించింది. అయితే దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేందుకు అనుమతించాలంటూ భారతీయ వైద్య మండలి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూచించింది కూడా.

ఇప్పుడైతే మేము 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నాం. కానీ సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో దేశంలో అమలువతున్న వ్యాక్సినేషన్ వ్యూహాన్ని వేగవంతం చేయాలని, యుద్ధప్రాతిపదికన కేంద్రం చర్యలు తీసుకోవాలని భారతీయ వైద్య మండలి ప్రధానికి రాసిన లేఖలో తెలిపింది.

కాగా జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా మొదలైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో తొలిదశలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు టీకా ఇచ్చారు. తర్వాత 60 ఏళ్లు నిండిన, 45 సంవత్సరాలు నిండి బహుముఖ వ్యాధులతో సతమతమవుతున్న వారికి వ్యాక్సిన్ ప్రక్రియను విస్తరించారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిబంధనలు సడలించింది.

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   9 hours ago

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   13 hours ago

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   15 hours ago

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   21 hours ago

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   a day ago

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   18 hours ago

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle