newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

గోల్డ్ బాండ్లు కొన్న వారి బాండ్లు బంగార‌మే

26-10-202026-10-2020 10:42:08 IST
2020-10-26T05:12:08.257Z26-10-2020 2020-10-26T05:12:04.363Z - - 03-12-2020

గోల్డ్ బాండ్లు కొన్న వారి బాండ్లు బంగార‌మే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తెచ్చిన స్కీమ్ కి రెస్పాండ్ అయిన వారికి ఇప్పుడు పండ‌గే. ఎందుకో తెలుసుగా. బంగారం ధ‌ర గాల్లో ఉంది. అందుకే ఇప్పుడు వాళ్లంతా ఫుల్లు ఖుషీగా ఉన్నారు. బాండ్లు అమ్ముకునే వారికి విత్ డ్రా అవ‌కాశం ఇచ్చింది సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్. కొనుక్కునే వాళ్లు కూడా ప్ర‌శాంతంగా కొనుక్కోవ‌చ్చు. అప్ప‌ట్లో కొన్న‌వారికి మాత్రం ఫుల్లుగా క‌లిసొచ్చింది అంటున్నారు బిజినెస్ అన‌లిస్టులు. 

సింపుల్ గా చెప్పుకుంటే సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చిన గోల్డ్ బాండ్ స్కీమ్ లో చాలా మంది గోల్డ్ కొన్నారు. అంటే గోల్డ్ రేట్ పై ఇన్వెస్ట్ చేశారు. పెరిగితే లాభాలు.. త‌గ్గితే న‌ష్టాలు. ఆలోచించిన వాళ్లు ఆలోచించారు. వెన‌క్కి త‌గ్గిన వారు త‌గ్గారు. కొన్న‌వాళ్లు కొన్నారు. కొంత‌మందేమో.. బాండ్లు తీసుకునేదేంటి.. బంగార‌మే తీసుకుందాం అని తీసుకున్నారు. కానీ బంగారం తీసుకుంటే త‌రుగు ఉంటుంది కానీ.. గోల్డ్ బాండ్ లో అలాంటి త‌రుగులేం ఉండ‌వు. పైగా పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ కి వ‌డ్డీ వ‌స్తుంది. బంగారం ధ‌ర పెరిగితే డ‌బ్బులూ వ‌స్త‌య్. అదీ గోల్డ్ స్కీమ్.

అప్ప‌ట్లో గ్రాము బంగారం ధ‌ర‌.2683 రూపాయ‌లు.. ఇప్పుడు 5135 రూపాయ‌లు. సో.. 90 శాతం ప్రాఫిట్ వ‌చ్చింది. 2015 లో కొన్న‌వారికి ఏటా 14 శాతం లాభం వ‌చ్చింద‌న్న‌మాట‌. ఈ గోల్డ్ బాండ్ లు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయి. అందుక‌ని.. వాటిని ఎప్పుడైనా కొనొచ్చు.. ఎప్పుడైనా అమ్ముకోవ‌చ్చు. ఇప్పుడు కొనేవాళ్ల‌కి ఏమో కానీ.. 2015లో కొన్న‌వాళ్ల‌కి  మాత్రం.. ఇప్పుడు డ‌బుల్ అమౌంట్ వ‌స్తుంది. చాలా మంది ఇదే మంచి టైమ్.. ఇంత‌కంటే పెర‌గ‌క పోవ‌చ్చేమో అని అమ్ముకుంటున్నారు. కొంత‌మందేమో.. ఈ బంగారం రేట్ ఇంత‌టితో ఆగ‌దు. కొంటే మంచిదే అని కొనుక్కుంటున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle