newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

30-09-202030-09-2020 10:25:42 IST
2020-09-30T04:55:42.883Z30-09-2020 2020-09-30T04:55:40.090Z - - 21-10-2020

భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత ప్రభుత్వం తమను వెంటాడి వేధిస్తున్నందుకు నిరసనగా దేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. బ్యాంకు ఖాతాలన్నీ కేంద్రప్రభుత్వం ఫ్రీజ్‌ చేయడంతో సిబ్బందిని బలవంతంగా విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఆమ్నెస్టీకి విదేశీ నిధులు చట్ట విరుద్ధంగా వస్తున్నాయని, ఆ సంస్థ ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద రిజిస్టర్‌ చేసుకోలేదని చెబుతోంది.

గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తమ సంస్థని వేధిస్తోందని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కుమార్‌ ఆరోపించారు.  ఢిల్లీ ఘర్షణలు, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో అల్లర్లలో మానవ హక్కులకు విఘాతంపై తమ సంస్థ ప్రశ్నలు సంధించిందని, ఫలితంగా బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్‌ జరిగిందన్నారు.  

ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ ఇండియా బ్యాంకు ఖాతాలన్నీ స్తంభించి పోయాయి. సెప్టెంబర్‌ 10న నుంచి అన్ని అకౌంట్లు ఫ్రీజ్‌ చేశారు. దీంతో మా సంస్థ చేపట్టే పనులన్నీ ఆగిపోయాయి. సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది అని ఆమ్నెస్టీ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 

అనుబంధ సంస్థపైనే విచారణ అన్న కేంద్రం

ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ స్వచ్ఛంద సంస్థపై ఈడీ విచారణ చేయడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు కంపెనీ  ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ అండ్‌ ఇండియన్స్‌ ఫర్‌ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ ట్రస్ట్‌ని మనీ ల్యాండరింగ్, ఫారెన్‌ ఎక్స్‌ఛేంజ్‌ నిబంధనల ఉల్లంఘనల కింద విచారిస్తున్నట్టుగా తెలిపాయి. అనుమతుల్లేకుండానే అందుకున్న రూ.51 కోట్లపై విచారిస్తున్నట్టు తెలిపింది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపణల్ని హోంశాఖ తిప్పికొట్టింది. ఆ ఆరోపణలు అవాస్తవం, అత్యంత దురదృష్టకరమని  పేర్కొంది. భారత చట్టాలను ఉల్లంఘించి నిధులు తెచ్చుకుంటున్న ఆ సంస్థ తాము చేస్తున్న పనుల నుంచి దృష్టి మరల్చడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా ఆమ్నెస్టీకి నిధులు అందుతున్నాయని, స్వచ్ఛంద సంస్థలకు అలా నిధులు రావడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. యూకే నుంచి 1.60 కోట్ల నిధుల కోసం 2011–12లో అప్పటి ప్రభుత్వం ఆమ్నెస్టీకి అనుమతులి చ్చిందని, 2013 నుంచే యూపీఏ హయాంలోనే అనుమతులు నిలిచి పోయాయని వెల్లడించింది.

దేశ చట్టాలను ఉల్లంఘించడానికి మానవ హక్కులను అడ్డుపెట్టుకోవడం తగదని, చట్టవిరుద్ద కార్యకలాపానుంచి దృష్టి మళ్లించడానికే మానవతావాద కృషిపై ఆమ్నెస్టీ  ప్రకటనలు చేస్తోందని కేంద్రం ఆరోపించింది. అనేక ఇతర సంస్థలు చేస్తున్న విధంగానే ఆమ్నెస్టీ తన మానవతావూర్వకమైన కృషిని కొనసాగించవచ్చని, అయితే విదేశీ విరాళాలతో నడుస్తున్న సంస్థలు దేశీయ రాజకీయ చర్చల్లో పాలుపంచుకోవడం, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని భారత చట్టాలు అనుమతించబోవని కేంద్రం తేల్చి చెప్పింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle